Modi | ప్రెస్‌మీట్‌ పెట్టక తొమ్మిదేండ్లు! ‘మోడీ’ మీడియా ముందుకు వస్తే.. చూడాలని ఉంది: నెటిజన్లు

Rahul Gandhi, Modi రాహుల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు నెటిజన్లు ఫిదా కిక్కిరిసిపోయిన మీడియా హాల్‌ మోదీ ఇలా ప్రెస్‌కాన్ఫరెన్స్‌ పెడతారా? అలాంటి దృశ్యం చూడాలని ఉన్నది సోషల్‌ మీడియాలో నెటిజన్ల వ్యాఖ్యలు విధాత: సూటిగా.. నిక్కచ్చిగా.. నిర్భయంగా! తడబాటు లేదు.. పొరపాటు లేదు! చెప్పాలనుకున్నది చెప్పాడు.. భయపడేది లేదని తేల్చి చెప్పాడు. క్షమాపణలు చెప్పడానికి తన పేరు సావార్కర్‌ కాదంటూ మళ్లీ ఎదురు నిలబడ్డాడు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆ పార్టీ మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ […]

Modi | ప్రెస్‌మీట్‌ పెట్టక తొమ్మిదేండ్లు! ‘మోడీ’ మీడియా ముందుకు వస్తే.. చూడాలని ఉంది: నెటిజన్లు

Rahul Gandhi, Modi

  • రాహుల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు నెటిజన్లు ఫిదా
  • కిక్కిరిసిపోయిన మీడియా హాల్‌
  • మోదీ ఇలా ప్రెస్‌కాన్ఫరెన్స్‌ పెడతారా?
  • అలాంటి దృశ్యం చూడాలని ఉన్నది
  • సోషల్‌ మీడియాలో నెటిజన్ల వ్యాఖ్యలు

విధాత: సూటిగా.. నిక్కచ్చిగా.. నిర్భయంగా! తడబాటు లేదు.. పొరపాటు లేదు! చెప్పాలనుకున్నది చెప్పాడు.. భయపడేది లేదని తేల్చి చెప్పాడు. క్షమాపణలు చెప్పడానికి తన పేరు సావార్కర్‌ కాదంటూ మళ్లీ ఎదురు నిలబడ్డాడు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో శనివారం ఆ పార్టీ మాజీ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) నిర్వహించిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌ సూపర్‌హిట్‌ అయిందనే చెప్పాలి. నెటిజన్లు కూడా ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సాగిన తీరుకు ఫిదా అయ్యారు.

అదే సమయంలో అనేక మంది ప్రధాని నరేంద్రమోదీ ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చూడాలని కోరికగా ఉన్నదని తమ మనసులో మాట బయట పెట్టారు. ‘మోదీ ఒక్కసారి ఇలా ప్రెస్మీట్ పెడితే చూడాలి అనిపిస్తుంది. ప్రపంచ నేత అంటారు, విశ్వ గురువు అంటారు, ఎక్కడ నోరు తెరవరు అదే మోదీ ప్రత్యేకత.

మరి అలాంటి వారిని విశ్వగురువు అనే వాళ్లకైనా ఆలోచన లేదంటే వాళ్ళ మానసిక పరిస్థితిని చూసి జాలి పడండి కాని వారిని ఏమి అనకండి’ అని ఒక నెటిజన్‌ తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు. ఎవరికీ కనిపించకుండా రేడియోలో మన్‌కీ బాత్‌ నిర్వహించే మోదీని ఉద్దేశించి.. ఒక నెటిజన్‌.. మోదీ, రాహుల్‌ ఫొటోలను పెట్టి.. ‘ఒకటి మన్‌కీ బాత్‌.. రెండోది దేశ్‌కీ బాత్‌’ అని కామెంట్‌ చేశారు.

మీడియా ముందుకు రాని మోదీ

ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ మీడియా సమావేశాలకు హాజరయ్యేందుకు ఏ మాత్రం వెనుకాడరు. తమపై లేదా తమ ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు ఎవరితోనో సమాధానం చెప్పించడం కాకుండా నేరుగా మీడియా ముందుకు వచ్చి సమాధానాలు ఇవ్వడం గతంలో చూశాం. అంతేకాదు.. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి మాట్లాడటమూ మామూలే. కానీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం అందుకు మినహాయింపు.