Nizamabad | వడగళ్ల వాన.. తడిసిన ధాన్యం

Nizamabad విధాత‌: నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలోని సుద్దులం, కొరట్ పల్లి, ధర్పల్లి, రామడుగు, జక్రాన్ పల్లిలో వడగండ్ల వాన అతులకుతులం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది రైతు వెంట అకాల వర్షం దయ్యంలా వెంటాడుతోంది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దానికి తోడు పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో పక్వానికి వచ్చిన ధాన్యం, మామిడి రాలిపోయింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిచి ముద్ద‌యింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు […]

Nizamabad | వడగళ్ల వాన.. తడిసిన ధాన్యం

Nizamabad

విధాత‌: నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలోని సుద్దులం, కొరట్ పల్లి, ధర్పల్లి, రామడుగు, జక్రాన్ పల్లిలో వడగండ్ల వాన అతులకుతులం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది రైతు వెంట అకాల వర్షం దయ్యంలా వెంటాడుతోంది.

పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దానికి తోడు పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన కురవడంతో పక్వానికి వచ్చిన ధాన్యం, మామిడి రాలిపోయింది.

కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిచి ముద్ద‌యింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు అవస్థలు పడ్డారు.

కొన్ని గ్రామాల్లో రాళ్ల వర్షం కురవడంతో కోతకు వచ్చిన పంట పూర్తిగా నేల రాలింది. రహదారికి పక్కనున్న చెట్లు గాలిదుమారానికి నేలమట్టమయ్యాయి. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను రైతులు వేడుకుంటున్నారు.