Nizamabad | తెలంగాణ సర్కార్, రైతు సర్కార్: ఎమ్మెల్యే గణేష్
Nizamabad విధాత, ప్రతినిధి నిజామాబాద్: రైతులకు 24 గం.లు ఉచిత కరెంట్ ఇవ్వకూడదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గం.ల ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని మాట్లాడిన PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తా, పవర్ హౌస్ ఎదురుగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన తెలిపిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ రైతు సర్కార్ […]

Nizamabad
విధాత, ప్రతినిధి నిజామాబాద్: రైతులకు 24 గం.లు ఉచిత కరెంట్ ఇవ్వకూడదని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 24 గం.ల ఉచిత విద్యుత్ రద్దు చేస్తామని మాట్లాడిన PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వర్ని చౌరస్తా, పవర్ హౌస్ ఎదురుగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి, నిరసన తెలిపిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బిగాల గణేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ రైతు సర్కార్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు సహించలేకపోతున్నారని విమర్శించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయని ఆరోపించారు. ఆయన తయారు చేసుకున్న సీక్రెట్ మ్యానిఫెస్టోని అమెరికాలో విడుదల చేశారని ఎద్దేవా చేశారు.
అమెరికాలో కూర్చొని మాట్లాడితే తెలంగాణలో తెలవదు అనుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సంక్షేమ పథకాలు 24 గంటల కరెంటు రద్దు చేసి మళ్ళీ పాత రోజులు వస్తాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి ఉండదు, సంక్షేమ పథకాలు ఉండవు, రైతుబంధు ఉండదు , 24 గంటల కరెంటు రద్దు చేస్తారని స్పష్టం చేశారు.
భారతదేశం అంతా తెలంగాణ వైపు చూస్తుందని అభివృద్ధి, సంక్షేమంలో మొదటి స్థానంలో ఉంది అని తెలిపారు. గతంలో చంద్రబాబు పాలనలో హైదరాబాదులో విద్యుత్ కోసం ధర్నా చేస్తే ఎన్కౌంటర్లు చేసిన ఘనత వాళ్లదైతే, భారతదేశ రాజధానిలో రైతులు ధర్నా చేస్తే ట్రాక్టర్లతో తొక్కించిన ఘనత బిజెపి ప్రభుత్వానిది అని గుర్తు చేశారు. అన్నం పెట్టే రైతులకు దన్నుగా నిలవాలే తప్ప పొట్ట గొట్టే విధంగా మాట్లాడితే అడ్రస్ లేకుండాపోతారని హెచ్చరించారు.