NTR, ధనుష్, వెట్రిమారన్ ప్రాజెక్టు లేనట్టే..!
విధాత, సినిమా: RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం సెట్స్ పైకి వెళ్ళ లేదు. షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కోరటాల శివకు అవకాశం ఇచ్చారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయినా ఆ చిత్రం ఇప్పటికీ పట్టాలెక్కలేదు. కొంతకాలం ఎన్టీఆర్ వల్ల మరి కొంతకాలం కొరటాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. కొరటాల శివ చెప్పిన స్క్రిప్ట్ కు ఎన్టీఆర్ పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడని సమాచారం. దాంతో ఆయన […]

విధాత, సినిమా: RRR మూవీ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మరో చిత్రం సెట్స్ పైకి వెళ్ళ లేదు. షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కోరటాల శివకు అవకాశం ఇచ్చారు. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయినా ఆ చిత్రం ఇప్పటికీ పట్టాలెక్కలేదు.
కొంతకాలం ఎన్టీఆర్ వల్ల మరి కొంతకాలం కొరటాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వస్తోంది. కొరటాల శివ చెప్పిన స్క్రిప్ట్ కు ఎన్టీఆర్ పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడని సమాచారం. దాంతో ఆయన స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు సూచించాడట వాటిని చేస్తూ ఉండడం వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుందని సమాచారం.
తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావడం, ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొరటాల శివ స్క్రిప్ట్ ని లాక్ చేయడం జరిగింది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయాల్సి ఉంది. కొరటాల చిత్రం ఎన్టీఆర్‌కి 30వ సినిమా. ఆయన 31వ సినిమా ప్రశాంత్ నీల్‌తో ఉండనుంది.
అయితే ఎన్టీఆర్ 32కి సంబంధించిన సినిమా విషయంలో ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే తాజాగా జాతీయ అవార్డు సాధించిన దర్శకులు వెట్రి మారన్ దర్శకత్వంలో నటిస్తాడని వార్తలు వచ్చాయి. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందనుందని మొదటి భాగం ఎన్టీఆర్‌తో దాని సీక్వెల్‌ను ధనుష్‌తో చేయనున్నాడని వార్తలు వచ్చాయి.
కానీ ప్రస్తుతానికి వెట్రిమారన్ విజయ్ సేతుపతితో ఓ సినిమా తీస్తున్నారు. దీని తరువాత సూర్యతో బిగ్ బడ్జెట్ ప్రాజెక్టు లైన్‌లో ఉంది. జల్లికట్టు బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. దాంతో వెట్రిమారన్ అటు విజయ్ సేతుపతితో సినిమా మరోవైపు సూర్యతో సినిమా చేసేంతవరకు ఎన్టీఆర్‌తో చిత్రం చేసే అవకాశం లేదు. మరోవైపు తన ప్రాజెక్లులతో ఎన్టీఆర్ కూడా బిజీబిజీగా ఉన్నారు. దాంతో వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే చిత్రం ప్రస్తుతానికి ఉండబోదని సమాచారం.