బ‌య్యారంలో నాణ్య‌మైన ముడి ఇనుము లేదు: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

విధాత: తెలంగాణ మోడ‌ల్ అంటూ దేశ‌మంతా తిరుగుతున్న కేసీఆర్ ముందు రాష్ట్రంలో ప్ర‌జ‌ల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల‌ని కేంద్ర మంత్రి సూచించారు.బ‌య్యారంలో నాణ్య‌మైన ముడి ఇనుము లేద‌ని. అక్క‌డ ప‌రిశ్ర‌మ పెడితే పోటీలో నిలువ‌లేమ‌ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్‌) ఎనిమిదేళ్ల కింద‌టే నిపుణుల క‌మిటీ నివేదిక ఇచ్చిందని కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇదే విష‌యాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా రాజ్య‌స‌భ‌లో చెప్పార‌ని గుర్తు చేశారు. […]

  • By: krs    latest    Sep 30, 2022 5:47 PM IST
బ‌య్యారంలో నాణ్య‌మైన ముడి ఇనుము లేదు: కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి

విధాత: తెలంగాణ మోడ‌ల్ అంటూ దేశ‌మంతా తిరుగుతున్న కేసీఆర్ ముందు రాష్ట్రంలో ప్ర‌జ‌ల జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల‌ని కేంద్ర మంత్రి సూచించారు.బ‌య్యారంలో నాణ్య‌మైన ముడి ఇనుము లేద‌ని. అక్క‌డ ప‌రిశ్ర‌మ పెడితే పోటీలో నిలువ‌లేమ‌ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్‌) ఎనిమిదేళ్ల కింద‌టే నిపుణుల క‌మిటీ నివేదిక ఇచ్చిందని కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఇదే విష‌యాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కూడా రాజ్య‌స‌భ‌లో చెప్పార‌ని గుర్తు చేశారు. అయినా స్వార్థ రాజ‌కీయాల కోసం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కేంద్రంపై విమ‌ర్శ‌లు చేస్తున్న‌ద‌ని కిష‌న్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రం స‌హ‌క‌రించ‌క‌ పోయినా బ‌య్యారంలో ఉక్కు ఫ్యాక్ట‌రీ క‌ట్టి తీరుతామ‌ని స్వ‌యంగా సీఎం కేసీఆర్ అన్నారని, ఇచ్చిన మాట ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం స్టీల్ ఫ్యాక్ట‌రీ పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

నిపుణుల క‌మిటీ స్ప‌ష్టంగా చెప్పిన త‌ర్వాత కూడా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న‌ద‌ని ఢిల్లీలో మండిప‌డ్డారు. జాతీయ రాజ‌కీయాల వైపు చూస్తున్న కేసీఆర్ ముందు స్వ‌రాష్ట్రంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను గుర్తించాల‌ని సూచించారు.