ఆ.. సినిమాలోనే కథ ఉండదు.. దానికి సీక్వెల్ ఎందుకో!
ఇలా హిట్టయిన ప్రతి చిత్రానికి సీక్వెల్ అంటే ఎలా..? విధాత. సినిమా: నేచురల్ స్టార్ నాని హిట్ మూవీలలో నేను లోకల్ ఒకటి. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రానికి ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకుడు. ధమాకాకి రచయితగా పనిచేసిన ప్రసన్నకుమార్ బెజవాడే ఈ చిత్రానికి కూడా పనిచేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన నేను లోకల్ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. పెద్దగా కథాబలం లేకపోయినా పనిపాటా లేకుండా బేవర్స్ గా […]

ఇలా హిట్టయిన ప్రతి చిత్రానికి సీక్వెల్ అంటే ఎలా..?
విధాత. సినిమా: నేచురల్ స్టార్ నాని హిట్ మూవీలలో నేను లోకల్ ఒకటి. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఈ చిత్రానికి ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకుడు. ధమాకాకి రచయితగా పనిచేసిన ప్రసన్నకుమార్ బెజవాడే ఈ చిత్రానికి కూడా పనిచేశారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన నేను లోకల్ విజయానికి చాలా కారణాలు ఉన్నాయి.
పెద్దగా కథాబలం లేకపోయినా పనిపాటా లేకుండా బేవర్స్ గా తిరిగే హీరో క్యారెక్టర్‌లో నటించిన నాని నటనా ప్రతిభతో పాటు పని పాటా లేని బేవర్స్ అనే పాయింట్ నేటి యూత్‌కి బాగా కనెక్ట్ అయింది. చాలా మంది హీరో క్యారెక్టర్‌లో తమను తాము లేదా తమకు తెలిసిన వారితో పోల్చుకున్నారు.
ప్రతి వారికి ఇలాంటి వారు తారస పడుతూనే ఉంటారు. ఇదే పాయింట్ యూత్‌కి బాగా కనెక్ట్ కావడం, నాని కూడా మన పక్కింటి కుర్రాడిలా రాణించడం అనేవి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. న్యాచురల్ స్టార్ నాని పెర్ఫార్మన్స్ తో ఈ చిత్రం బాగా ఆడింది. ఎంటర్టైన్మెంట్ కథలో భాగంగా ఉండడంతో ఆరంభంలో యావ రేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తర్వాత యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో సినిమాకి డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.ఈ మూవీతో త్రినాథరావు నక్కిన-ప్రసన్నకుమార్ బెజవాడల కాంబినేషన్‌కు మంచి ఫేమొచ్చింది.
ఇది ఇలా ఉంటే తాజాగా త్రినాథరావు నక్కిన-ప్రసన్నకుమార్ బెజవాడ ఇద్దరు మరోసారి రవితేజతో ధమాకా అనే బ్లాక్ బస్టర్ కొట్టారు. 100 కోట్లకు పైగా గ్రాసును కలెక్ట్ చేసి రికార్డులను క్రియేట్ చేశారు. ధమాకా చిత్రంలో కూడా చెప్పుకోవడానికి అంటూ కథ ఏమీ లేదు. ఎంటర్టైన్ మిక్స్ చేసి పెట్టడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
ఈ జోడీ జోరు మీద ఉన్న సందర్భంగా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్‌లో వచ్చిన హిట్ సినిమాల్లో నేను లోకల్ మూవీకి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు తెలిపారు. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ రైజేషన్ ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయిందని అందుకే ఛాన్స్ దొరికితే నేను లోకల్‌కి సీక్వెల్ తీస్తానని తన మనసులో మాట బయటపెట్టారు.
అయితే నేను లోకల్ సినిమాలో సీక్వెల్ తీసే అంత కథ, దమ్ము ఏముంది అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. అసలు ఈ సినిమా హిట్ కావడమే పెద్ద లక్. దానికి సీక్వెల్ ఏముందని తీస్తారని పోస్టులు పెడుతున్నారు. కథాబలం ఉంటే చిత్రం సీక్వెల్ పై దృష్టి పెట్టవచ్చు. కానీ ఒక మామూలు కమర్షియల్ సినిమాకి సీక్వెల్ చేయాలంటే మాత్రం కచ్చితంగా చాలా వర్క్ చేయాల్సి ఉంటుందని వారు కామెంట్ చేస్తున్నారు.