మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి బండ ప్రకాష్ నామినేషన్
విధాత: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ శనివారం నామినేషన్ వేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మండలిలో బీఅర్ఎస్‌కు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్న నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌గా ప్రకాష్ ఎన్నిక లాంఛనమే కానుంది. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికవ్వనున్న బండ ప్రకాష్ ముదిరాజ్‌కు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, ఫరూఖ్ హుస్సేన్, […]

విధాత: తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాష్ శనివారం నామినేషన్ వేశారు. అనంతరం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
మండలిలో బీఅర్ఎస్‌కు పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్న నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్‌గా ప్రకాష్ ఎన్నిక లాంఛనమే కానుంది.
డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికవ్వనున్న బండ ప్రకాష్ ముదిరాజ్‌కు రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారి, ఫరూఖ్ హుస్సేన్, ప్రభాకర్ రావు తదతరులు శుభాకాంక్షలు తెలియజేశారు.