YS Sharmila | BRS అంటే.. బీజేపీ రాష్ట్ర సమితి: వైఎస్. షర్మిల
YS Sharmila విధాత: బీజేపీ, బీఆర్‌ఎస్ లు రెండు వేర్వేరు పార్టీలు కాదని, రెండు పార్టీలు కలిసి " బీజేపీ రాష్ట్ర సమితి " రాజకీయాన్ని నడుపుతున్నాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల విమర్శించారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకిందని చెబుతున్న బీజేపీకి కేంద్రంలో అధికారం అవినీతిని కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి చేతులు ఎందుకు రావడం లేదని నిలదీశారు. బీజేపీకి, బీఆర్‌ఎస్ బీ టీం కాకపోతే కేసీఅర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. కేసీఅర్ […]

YS Sharmila
విధాత: బీజేపీ, బీఆర్‌ఎస్ లు రెండు వేర్వేరు పార్టీలు కాదని, రెండు పార్టీలు కలిసి ” బీజేపీ రాష్ట్ర సమితి ” రాజకీయాన్ని నడుపుతున్నాయని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల విమర్శించారు. కేసీఆర్ అవినీతి ఢిల్లీ దాకా పాకిందని చెబుతున్న బీజేపీకి కేంద్రంలో అధికారం అవినీతిని కేసీఆర్‌ను అరెస్టు చేయడానికి చేతులు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
బీజేపీకి, బీఆర్‌ఎస్ బీ టీం కాకపోతే కేసీఅర్ ను ఎందుకు అరెస్ట్ చేయలేదన్నారు. కేసీఅర్ ది అత్యంత అవినీతి ప్రభుత్వం అయితే తక్షణ దర్యాప్తుకి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. మాయల ఫకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు కేసీఅర్ అవినీతి చిట్టా మీ దగ్గర పెట్టుకుని మీకు నచ్చినట్లు కేసీఅర్ ను ఆడిస్తుంటే, మీరు చెప్పినట్లు కేసీఆర్ నటిస్తున్నాడన్నారు.
మోడీ కేసీఅర్ ను కేడి అంటే..మోడీని బోడి అని కేసీఅర్ అంటాడని, నువ్వు కొట్టినట్లు చెయ్యి,నేను పడ్డట్లు ఏడుస్త ఇదే ఇద్దరి మధ్య రహస్య ఒప్పందమని షర్మిల ఎద్దేవా చేశారు. “పైకి సిగపట్లు, లోపల చప్పట్లు” ఇదే రెండు పార్టీల దొంగ రాజకీయమన్నారు. మోడీ వద్ధ కేసీఅర్ అవినీతిపై ఇంత సమాచారం ఉంటే…ఇన్నాళ్లు ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.
ఢిల్లీ దాకా కేసీఆర్ అవినీతి పాకిందని చెబుతున్న బీజేపీకి..కేంద్రంలో అధికారం పెట్టుకొని చర్యలకు చేతులు రావెందుకో.!అవినీతి కేసీఅర్ ను అరెస్ట్ చేయడానికి మనసు రాదేందుకో.!మోడీ కేసీఅర్ ను కేడి అంటే..మోడీని బోడి అని కేసీఅర్ అంటాడు.నువ్వు కొట్టినట్లు చెయ్యి,నేను పడ్డట్లు ఏడుస్త ఇదే ఇద్దరి…
— YS Sharmila (@realyssharmila) July 9, 2023
కాళేశ్వరం అవినీతిపై సాక్ష్యాధారాలు కేంధ్రం చేతిలో పెట్టుకొని యాక్షన్ తీసుకోక పోవడం మీ రహస్య బంధానికి ప్రతీక కాదా అంటు షర్మిల నిలదీశారు. లిక్కర్ స్కాంపై దూకుడు పెంచిన దర్యాప్తు సంస్థలు కేసీఅర్ బిడ్డ కవిత ప్రధాన సూత్రదారి అని తెలిసి కూడా ఒక్కసారిగా సైలెంట్ అవ్వడం మీ దోస్తానాలో భాగమన్నారు.
టీఎస్‌పీఎస్‌సీ స్కాంపై కేంద్రం వేసిన ఈడీ విచారణలో ఐటీ మంత్రి లోపమే అని తెలిసినా పట్టింపు లేకపోవడం మీరు మీరు ఒక్కటే అనడానికి నిదర్శనమని షర్మిల ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకుతిన్న కల్వకుంట్ల కుటుంబానికి బీజేపీనే అండా దండ అన్నారు. నిజంగా కేసీఅర్ తెలంగాణ బిడ్డనే అయితే, బీజేపీతో వైరమే ఉంటే మోడీ రాష్ట్రానికి వస్తే ఎందుకు మొహం చాటేస్తున్నట్లు..? ప్రధానికి ఎదుటపడి ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.
విభజన హామీలపై అమితుమి అంటూ ఎందుకు పట్టుబట్టడం లేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ , గిరిజన యూనివర్సిటీ,..కేంద్రం ఇచ్చే ఉద్యోగాలు లాంటి విషయాల్లో ఎందుకు కేంద్రంపై దండయాత్రకు సిద్ధ పడటం లేదంటు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.