MInister KTR | మోదీ సమన్లకు భయపడం.. విచారణను ఎదుర్కొనే దమ్ము మాకుంది : మంత్రి కేటీఆర్
విధాత: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavith) కు జారీ చేసిన నోటీసులు ఈడీ నోటీసులు కాదని, ఇవి మోదీ నోటీసులు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పష్టం చేశారు. మోదీ సమన్లకు భయపడేవారు తెలంగాణలో ఎవరూ లేరని, విచారణను ఎదుర్కొనే దమ్ము తమకు ఉందని కేటీఆర్ తేల్చిచెప్పారు. కవిత తప్పకుండా విచారణను ఎదుర్కొంటారు అని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ (BL Santhosh) […]

విధాత: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavith) కు జారీ చేసిన నోటీసులు ఈడీ నోటీసులు కాదని, ఇవి మోదీ నోటీసులు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పష్టం చేశారు. మోదీ సమన్లకు భయపడేవారు తెలంగాణలో ఎవరూ లేరని, విచారణను ఎదుర్కొనే దమ్ము తమకు ఉందని కేటీఆర్ తేల్చిచెప్పారు. కవిత తప్పకుండా విచారణను ఎదుర్కొంటారు అని ఆయన స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ (BL Santhosh) విచారణకు రాకుండా దాక్కుంటున్నాడు. ఆయనలా కాకుండా తప్పకుండా విచారణకు సహకరిస్తాం. భారత చట్టాలను గౌరవించే పౌరులుగా విచారణకు హాజరవుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. విచారణ ఎదుర్కొనే దమ్ము తమకుంది.. విచారణను ఎదుర్కొనే దమ్ము ఉందా.. అని మోదీకి కేటీఆర్ సవాల్ విసిరారు.
తమ మంత్రులు గంగుల కమలాకర్ ( Gangula Kamalakar) మీద ఈడీ, సీబీఐ దాడులు, మల్లారెడ్డి (Malla Reddy) మీద ఐటీ దాడులు, తలసాని పీఏ ఇంటి మీద ఈడీ దాడులు చేసింది. జగదీశ్ రెడ్డి పీఏ ఇంటిపై ఐటీ దాడులు, ఎంపీ నామా మీద ఈడీ దాడులు, మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్రపై సీబీఐ దాడులు, పార్థసారథి రెడ్డి, మన్నెశ్రీనివాస్ రెడ్డిపై ఐటీ దాడులు, ఎమ్మెల్సీ రమణపై ఈడీ దాడులు చేశారు.
అంతే కాకుండా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డిపై ఈడీ దాడులు నిర్వహించింది. కేసీఆర్‌ను ఎదుర్కొలేకనే తమ నాయకులపై మోదీ ప్రభుత్వం.. ఈడీ, సీబీఐ, ఐటీని ఉసిగొల్పింది. అయితే తెలంగాణలో ఒక అజేయమైన శక్తిగా ఎదిగిన విధానాన్ని గమనించిన తర్వాత ఎమ్మెల్సీ కవితకు కూడా ఈడీ నోటీసులు జారీ అయ్యాయి. ఇవి ఈడీ నోటీసులు కాదు.. కచ్చితంగా మోదీ సమన్లు అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మలా, ఈడీ తోలుబొమ్మలా మారిందన్నారు.
ఈ తొమ్మిదేండ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. ప్రతిపక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి తప్ప సాధించింది ఏమీ లేదు. నీతి లేని పాలనకు, నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు ఎన్డీఏ ప్రభుత్వం పర్యాయ పదంగా మారిందని కేటీఆర్ విమర్శించారు. గౌతమ్ అదానీ ఎవరి బినామీ? అని మోదీని అడుగుతున్నాను. అదానీ అవినీతిపై మోదీ, ఆర్థిక మంత్రి ఎందుకు స్పందించడం లేదు.. బినామీని కాపాడుకునే బాధ్యత వారిపై ఉంది కాబట్టి స్పందించడం లేదు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
మోదీ తన తొమ్మిదేండ్ల పాలనలో తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన మాట వాస్తవం కాదా..? అని కేటీఆర్ అడిగారు. పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన మాట నిజం కాదా..? డబుల్ ఇంజిన్ అంటే దేశానికి అర్థమైంది. ఒక ఇంజిన్ మోదీ, ఇంకో ఇంజిన్ అదానీ. అడ్డమైన దొంగ సొమ్ముతో ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను చీల్చి, లొంగని వారిపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడమే మోదీ పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
Read more>>