అర్ధరాత్రి నోట్ల వర్షం.. దొరికినట్లే దొరికి చేజారిపోయాయి..!

గంటల్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు లబోదిబో అంటున్న డబ్బు దొరికిన వ్యక్తులు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వర్ధన్నపేట కొత్త బస్టాండ్ లోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని కారు నుంచి నోట్లు జారి పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నుంచి కొన్ని 500 రూపాయల నోట్లు కిందపడిపోయాయి. దీంతో రోడ్డు పక్కనే ఉన్న కొంత మంది వ్యక్తులు వాటిని […]

  • By: Somu    latest    Jan 31, 2023 10:11 AM IST
అర్ధరాత్రి నోట్ల వర్షం.. దొరికినట్లే దొరికి చేజారిపోయాయి..!
  • గంటల్లో స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • లబోదిబో అంటున్న డబ్బు దొరికిన వ్యక్తులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో వర్ధన్నపేట కొత్త బస్టాండ్ లోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ గుర్తు తెలియని కారు నుంచి నోట్లు జారి పడిన సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

కారు నుంచి కొన్ని 500 రూపాయల నోట్లు కిందపడిపోయాయి. దీంతో రోడ్డు పక్కనే ఉన్న కొంత మంది వ్యక్తులు వాటిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి దొరికిన కాడికి ఏరుకున్నారు. ఒక్కో వ్యక్తికి రూ. 500 నుండి రూ. 2వేల వరకు లభించగా వాటిని తమ జల్సాలకే వాడుకున్నారు. అయితే ఈ విషయం మధ్యాహ్నం జరిగి రాత్రి వేలుగులోకి రావడంతో విషయాన్ని పసిగట్టిన పోలీసులు డబ్బులు తీసుకున్న వ్యక్తుల ఇండ్ల వద్దకు వెళ్లి తీసుకున్న డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఈ విషయం స్థానికంగా ప్రచారం కావడంతో పోలీసులకు ఇప్పుడు తలనొప్పిగా మారింది. దీంతో పోలీసులు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై పెట్రోలింగ్ చేయడంతో పాటు డబ్బులు తీసుకున్న వ్యక్తుల వివరాలు సేకరిస్తూ వారిని విచారించడంతో రాత్రి వేళల్లో ఇండ్ల వద్దకు పోలీసులు రావడంతో ఆ కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. మధ్యాహ్నం జరిగిన ఘటన పోలీసులకు రాత్రి తెలియడంతో గుర్తుతెలియని కారు ఎవరిది డబ్బులు ఎందుకు వేశారు? లేకుంటే కారు నుంచి జారి పడిపోయాయా అనేదానిపై ఆరా తీస్తున్నారు.

డబ్బులు దొరికిన సంబురంలో ఉన్న వ్యక్తులు హాయిగా జల్సా చేసి ఇంటికి పోయేసరికి పోలీసులు వచ్చి తిరిగి రికవరీ చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై దొరికిన డబ్బులను పోలీసులు అన్యాయంగా తీసుకోవడం సరైనది కాదని వేలల్లో లక్షల్లో దొరికిన డబ్బులు కాదని చెబుతున్నారు. కూలినాలీ చేసుకునే వ్యక్తులకు రోడ్డుపై డబ్బులు దొరకడంతో సంతోషం వ్యక్తం చేయగా ఆ సంతోషాన్ని పోలీసులు గంటల్లోనే లేకుండా చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.