Delhi | దేశ రాజ‌ధానిలో ఎన్‌కౌంట‌ర్‌.. కాంట్రాక్ట్ కిల్ల‌ర్‌పై ఢిల్లీ స్పెషల్ టీమ్ కాల్పులు

Delhi కాలికిగాయం.. ద‌వాఖాన‌కు త‌ర‌లింపు రోహిణి సెక్టార్‌లో తెల్ల‌వారుజామున ఘ‌ట‌న‌ విధాత‌: అది దేశ రాజ‌ధాని శివారు ప్రాంతం.. గురువారం ఉద‌యం తెల్ల‌వారుజామున కొంద‌రు పౌరులు వాకింగ్ చేస్తున్నారు.. అంత‌లోనే ఒక క్రిమిన‌ల్ బైక్‌పై ర‌య్యిన‌ దూసుకెళ్లాడు. పోలీస్ వాహ‌నంలో స్పెష‌ల్ టీమ్ సైర‌న్‌తో వెంబ‌డిస్తు స‌రెండ‌ర్‌.. స‌రెండ‌ర్.. అంటూ హెచ్చ‌రిస్తున్న‌ది. అయినా, ఆ క్రిమిన‌ల్ విన‌లేదు.. పైగా తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దాంతో స్పెష‌ల్ టీమ్ గురిచూసి అత‌డి కాలిని కాల్చింది. క్రిమిన‌ల్ బైక్‌తోస‌హా కింద‌ప‌డ్డాడు. […]

Delhi | దేశ రాజ‌ధానిలో ఎన్‌కౌంట‌ర్‌.. కాంట్రాక్ట్ కిల్ల‌ర్‌పై ఢిల్లీ స్పెషల్ టీమ్ కాల్పులు

Delhi

  • కాలికిగాయం.. ద‌వాఖాన‌కు త‌ర‌లింపు
  • రోహిణి సెక్టార్‌లో తెల్ల‌వారుజామున ఘ‌ట‌న‌

విధాత‌: అది దేశ రాజ‌ధాని శివారు ప్రాంతం.. గురువారం ఉద‌యం తెల్ల‌వారుజామున కొంద‌రు పౌరులు వాకింగ్ చేస్తున్నారు.. అంత‌లోనే ఒక క్రిమిన‌ల్ బైక్‌పై ర‌య్యిన‌ దూసుకెళ్లాడు. పోలీస్ వాహ‌నంలో స్పెష‌ల్ టీమ్ సైర‌న్‌తో వెంబ‌డిస్తు స‌రెండ‌ర్‌.. స‌రెండ‌ర్.. అంటూ హెచ్చ‌రిస్తున్న‌ది.

అయినా, ఆ క్రిమిన‌ల్ విన‌లేదు.. పైగా తుపాకీతో కాల్పులు ప్రారంభించాడు. దాంతో స్పెష‌ల్ టీమ్ గురిచూసి అత‌డి కాలిని కాల్చింది. క్రిమిన‌ల్ బైక్‌తోస‌హా కింద‌ప‌డ్డాడు. విల‌విలలాడుతున్న క్రిమిన‌ల్ రెక్క‌లు విరిచి జీపులోకి ఎక్కించారు. ఇదేమి యాక్ష‌న్ సినిమా షూటింగ్ కాదు.. ఢిల్లీలో గురువారం జ‌రిగిన యాధార్థ ఎన్‌కౌంట‌ర్‌..

ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 29-30 సమీపంలో కామిల్ అనే కాంట్రాక్ట్ కిల్లర్ సంచ‌రిస్తున్న‌ట్టు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌కు స‌మాచారం అందింది. గురువారం తెల్ల‌వారుజామున స‌మాచారం అందుకున్న స్పెష‌ల్ టీమ్ పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకోగా.. ముందే ప‌సిగట్టిన‌ కామిల్ బైక్ అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. అత‌డిని గుర్తించిన పోలీసులు వాహ‌నంలో వెంబ‌డించారు. లొంగిపోవాల్సిందిగా వారు మొదట అభ్యర్థించారు.

అయితే, అతడు ప‌ట్టించుకోలేదు. పైగా అధికారులపై కాల్పులు జరిపాడు. పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో క్రిమిన‌ల్‌ కాలికి బుల్లెట్ త‌గిలింది. బైక్‌తో స‌హా కింద‌ప‌డ‌టంతో అత‌డిని పోలీసులు అరెస్టు చేశారు. చికిత్స నిమిత్తం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. అతని నుంచి టర్కీలో తయారుచేసిన జిగానా పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్ట్ కిల్ల‌ర్‌ను ప‌ట్టుతీరు వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.