‘మోదీ హఠావో.. దేశ్‌ బచావో’.. ఢిల్లీలో వెలసిన పోస్టర్లు.. 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ హఠావో.. దేశ్‌ బచావో’ అంటూ పలువురు వ్యక్తులు పోస్టర్లు వేశారు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వంద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలు లేవని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. నగర నగరవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారన్నారు. ప్రింటింగ్ ప్రెస్ చట్టం, ఆస్తుల దుర్వినియోగం చట్టంలోని సెక్షన్ల […]

‘మోదీ హఠావో.. దేశ్‌ బచావో’.. ఢిల్లీలో వెలసిన పోస్టర్లు.. 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు

PM Modi | ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. ‘మోదీ హఠావో.. దేశ్‌ బచావో’ అంటూ పలువురు వ్యక్తులు పోస్టర్లు వేశారు. ఈ ఘటనలో ఆరుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వంద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ వివరాలు లేవని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ పేర్కొన్నారు. నగర నగరవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేశారన్నారు. ప్రింటింగ్ ప్రెస్ చట్టం, ఆస్తుల దుర్వినియోగం చట్టంలోని సెక్షన్ల కింద నగరవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఓ వ్యాన్‌లో కొన్ని పోస్టర్లను స్వాధీనం చేసుకున్నామని, ఈ విషయంలో విచారణ కొనసాగుతుందని చెప్పారు.