డాక్టర్ ముసుగులో క్షుద్ర పూజలు.. ఇద్దరి అరెస్ట్, పరారీలో మరో ముగ్గురు
తవేరా వాహనం, నగదు స్వాధీనం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మోసాలకు గురిచేస్తున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హనమకొండ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసిపి ఏం.ఏ బారి మీడియాతో వివరాలు తెలిపారు. హన్మకొండ నయీంనగర్ కు చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు […]

- తవేరా వాహనం, నగదు స్వాధీనం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: మంత్రాల నెపంతో, చేతబడులను క్షుద్రపూజలతో తగ్గిస్తానని అమాయక పేద ప్రజలను మోసాలకు గురిచేస్తున్న ఇద్దరు మంత్రగాళ్లను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, హనమకొండ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసిపి ఏం.ఏ బారి మీడియాతో వివరాలు తెలిపారు. హన్మకొండ నయీంనగర్ కు చెందిన సయ్యద్ ఖదీర్ అహ్మద్ (53) మరియు అతని అన్న కుమారుడు సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (47) ఇద్దరు కలిసి ఫారహీన పేరిట ఆసుపత్రి ప్రారంభించారు. ఆసుపత్రి ముసుగులో క్షుద్రపూజలకు పాల్పడుతున్న వీరిని అరెస్టు చేసి తవేర వాహనం, రూ.3లక్షల నగదు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ఆకస్మిక దాడులు
టాస్క్ఫోర్స్ ఏ సి పి ఏం. జితేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ బృందం, వైద్యశాఖ సిబ్బందితో ఫారహీన ఆసుపత్రి పై సోమవారం దాడులు చేసి, డాక్టర్ ముసుగులో క్షుద్రపూజలు చేసి చేతబడి చేసి తగ్గిస్తామని మోసం చేస్తున్న సయ్యద్ ఖదీర్ అహ్మద్, సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ లను విచారించారు.
విచారణలో వెల్లడైన నిజాలు
రోగాలను నయం చేసే నెపంతో క్షుద్రపూజాలు చేసి, నమ్మించి డబ్బులు వసూలు చేశారు. ఫారహీన క్లినిక్ పేరిట ఎలాంటి అనుమతి, ల్యాబూ పత్రాలు లేకుండా ఆసుపత్రికి వచ్చిన రోగులకు చేతబడులు చేశారని, దయ్యం పట్టిందని భయాలు కలిగించి క్షుద్రపూజలు చేసి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలను వసూలు చేస్తున్నారు.
క్షుద్రపూజలకు సహాయం చేసిన హైదరాబాద్ ఉప్పల్ కు చెందిన సయ్యద్ షబ్బీర్ అహ్మెద్ (46) ని అదుపులోకి తీసుకొన్నారు. క్షుద్రపూజలకి సహకరించిన యాకూబ్ బాబా, అతని భార్య సమరీన్, ఏం. డీ ఇమ్రాన్ పరారీలో ఉన్నారు. సయ్యద్ ఖదీర్ అహ్మెద్ పై గతంలో గుప్తా నిధుల తవ్వకం పై కేసు నమోదైంది. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. క్షుద్రపూజల పేరుతో మోసాలకు పాల్పడితే రౌడీ షీట్ తోపాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డిసిపి హెచ్చరించారు. నిందితుల అరెస్టులో ప్రతిభ కనబర్చిన టాస్క్ఫోర్స్ ఏ సి పి ఏం. జితేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావ్, ఎస్సై లు నిస్సార్ పాషా, లవన్ కుమార్, ఏ ఏ వో సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ స్వర్ణలత, కానిస్టేబుల్ బిక్షపతి, రాజేష్, రాజు, శ్రీనివాస్, శ్రావణ కుమార్, నాగరాజు, నవీన్ లను ఆభినందిచారు.