RJD | ఈ రైలు ప్ర‌మాదం పాపం మోదీదే: ఆర్జేడీ

విధాత‌: ఒడిశాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని బాధ్యుడ్ని చేస్తూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. రైల్వే బ‌డ్జెట్‌ను ప్ర‌ధాన బ‌డ్జెట్‌తో విలీనం చేయ‌డ‌మే ఇలాంటి ఘోర ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని మాజీ రైల్వే మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అధినేతగా ఉన్న‌ రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (RJD) విమ‌ర్శించింది. दुःखद रेल हादसा। एक दौर था जब देश रेल मंत्री का नाम जानता था। रेल बजट अलग पेश होता […]

RJD | ఈ రైలు ప్ర‌మాదం పాపం మోదీదే: ఆర్జేడీ

విధాత‌: ఒడిశాలో జ‌రిగిన ఘోర రైలు ప్ర‌మాదానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీని బాధ్యుడ్ని చేస్తూ ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. రైల్వే బ‌డ్జెట్‌ను ప్ర‌ధాన బ‌డ్జెట్‌తో విలీనం చేయ‌డ‌మే ఇలాంటి ఘోర ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని మాజీ రైల్వే మంత్రి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ అధినేతగా ఉన్న‌ రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (RJD) విమ‌ర్శించింది.

‘ఇదో ఘోర ప్ర‌మాదం. ఒక‌ప్పుడు రైల్వే శాఖ మంత్రి అంటే అంద‌రికీ తెలిసేది. రైల్వే బ‌డ్జెట్ ప్ర‌త్యేకంగా రూపొందేది. రైల్వే ప్రైవేట్ ప‌రం కాకుండా ఉండేది’ అని ఆర్జేడీ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం అన్ని రైళ్ల‌కూ సంకుచిత భావం క‌లిగిన ఓ వ్య‌క్తే అన్ని రైళ్ల‌కూ ప‌చ్చ జెండా ఊపుతున్నార‌ని పేర్కొంటూ వందే భార‌త్‌కు రైళ్ల‌కు ప్ర‌ధాని జెండా ఊపుతున్న వీడియోను జ‌త చేసింది.

ఈ ఘోర ప్ర‌మాదంపై కాంగ్రెస్ సైతం స్పందించింది. దుర్ఘ‌ట‌న‌పై ప‌లు ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఒక రోజు త‌ర్వాత వాటిని సంధిస్తామ‌ని పార్టీ నాయ‌కుడు జైరాం ర‌మేశ్ వెల్ల‌డించారు. ఒడిశా లోని బాలాసోర్ జిల్లాలో జ‌రిగిన ఈ దుర్ఘ‌ట‌నలో మూడు రైళ్లు ఢీకొన్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు 278 మంది మ‌ర‌ణించ‌గా.. 900 మందికి పైగా క్ష‌త‌గాత్రులుగా మారారు. 1200 మంది స‌హాయ‌క సిబ్బందితో పాటు 200 అంబులెన్సులు, 50 బ‌స్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లు నిరంత‌రం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయ‌ని అధికారులు తెలిపారు.