వైభవోపేతంగా పాత గుట్ట లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం
విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధాలయం పాత గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం రాత్రి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి దేవస్థానం తరపున అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వధూవరులైన లక్ష్మీనరసింహులను పట్టు వస్త్రములు, రత్న ఖచిత సువర్ణాభరణాతో ముస్తాబు చేసి కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన యజ్ఞాచార్యులు, ప్రధానార్చకుల వేద పండిత బృందం ఆగమ శాస్త్రానుసారం కళ్యాణోత్సవాన్ని కనుల పండవగా […]

విధాత: యాదగిరిగుట్ట దేవస్థానం అనుబంధాలయం పాత గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్ర వారం రాత్రి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవానికి దేవస్థానం తరపున అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.
వధూవరులైన లక్ష్మీనరసింహులను పట్టు వస్త్రములు, రత్న ఖచిత సువర్ణాభరణాతో ముస్తాబు చేసి కళ్యాణ వేదికపై కొలువు తీర్చిన యజ్ఞాచార్యులు, ప్రధానార్చకుల వేద పండిత బృందం ఆగమ శాస్త్రానుసారం కళ్యాణోత్సవాన్ని కనుల పండవగా నిర్వహించారు.
క్షీర సముద్ర తనయ లక్ష్మీ అమ్మవారు ముత్యాల పల్లకిలో, శ్రీవారు గజవాహనరుడుడై కళ్యాణ వేదికపైకి మంగళ వాయిద్యాల మధ్య తరలివచ్చారు. వేదమంత్రోచ్చారణలు ,మంగళ వాయిద్యాలతో, భక్తుల గోవింద నామస్మరణ మధ్య మాంగల్య ధారణ, తలంబ్రాదారణ ఘట్టాలను మనోరంజకంగా నిర్వహించారు. లోక కళ్యాణ కారకులైన లక్ష్మీ నరసింహుల కళ్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తజనం భక్తి తో పులకించారు.
శ్రీ దరూరి రామనుజాచార్యులు కళ్యాణ విశేషాల వాఖ్యానంతో అలరించారు. కళ్యాణ అనంతరం స్వామి అమ్మవార్లను గజవాహన పై ఊరేగించారు. కళ్యాణోత్సవం కార్యక్రమంలో ఆర్డిఓ భూపాల్ రెడ్డి దేవస్థానం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు శనివారం ఉదయం హవనం, గరుడ వాహన సేవ, సాయంత్రం 6 గంటలకు రథంగాహోమం,శ్రీవారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు.