పార్లమెంట్‌లో అదానీ రచ్చ.. ఉభయ సభలు వాయిదా

Parliament | పార్లమెంట్‌లో అదానీ వ్యవహరంపై రచ్చ కొనసాగుతూనే ఉన్నది. అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఈ క్రమంలో నెలకొన్న గందరగోళం మధ్య వరుసగా మూడోరోజు పార్లమెంట్‌ కార్యకలాపాలు కొనసాగడం లేదు. అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశాయి. అలాగే ప్రధాని ప్రకటనపై సైతం సోమవారం ఉభయ సభల్లో దుమారం రేగిన విషయం తెలిసింది. మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలు మొదలైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు చర్చకు […]

పార్లమెంట్‌లో అదానీ రచ్చ.. ఉభయ సభలు వాయిదా

Parliament | పార్లమెంట్‌లో అదానీ వ్యవహరంపై రచ్చ కొనసాగుతూనే ఉన్నది. అదానీ గ్రూప్‌పై హిడెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. ఈ క్రమంలో నెలకొన్న గందరగోళం మధ్య వరుసగా మూడోరోజు పార్లమెంట్‌ కార్యకలాపాలు కొనసాగడం లేదు. అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశాయి. అలాగే ప్రధాని ప్రకటనపై సైతం సోమవారం ఉభయ సభల్లో దుమారం రేగిన విషయం తెలిసింది. మంగళవారం పార్లమెంట్‌ సమావేశాలు మొదలైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు చర్చకు డిమాండ్‌ చేశాయి.

ఈ క్రమంలో నెలకొన్న గందరగోళం మధ్య ఉభయసభలు మధ్యాహ్న 12 గంటల వరకు వాయిదాపడ్డాయి. అయితే, అదానీ అంశంపై కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ మాట్లాడుతూ మన నియంత్రణలో ఉన్న సంస్థ విశ్వసనీయత ప్రశ్నలు తలెత్తుతున్నాయని, అందుకే సెబీ చైర్మన్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. హిడెన్‌బర్గ్‌ రిపోర్ట్‌లో చేసిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, అవి నిజమా? అబద్ధామా? తేలాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో దీనిపై తొలుత చర్చించాలని, ఆ తర్వాత ఏం అంశంపై చర్చిస్తారో చర్చించాలన్నారు.

సభ అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం సమాధానం ఇవ్వదన్నారు. ప్రతిపక్షాలు సభను స్తంభింపజేయడంపై విమర్శలపై కాంగ్రెస్‌ అధిర్‌ రంజన్‌ చౌదరి విమర్శలు గుప్పించారు. సభను స్తంభింపజేయడం ప్రజాస్వామ్యంలో భాగమని ఆ పార్టీ సీనియర్‌ నేతలు అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ చెబుతుంటేవారని గుర్తు చేశారు. బెంగాల్‌లో తాజ్‌పూర్‌ పేరుతో ఓడరేవును నిర్మిస్తున్నందున మమతా బెనర్జీ, అదానీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. అదానీ, మోదీజీతో మమతాజీ సంబంధాలు మారిపోయాయని, ప్రస్తుతం మోదీకి వ్యతిరేకంగా మమతాజీ ఏమీ మాట్లాడడం లేదన్నారు.

మరో వైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై చర్చ కావాలని, జేపీసీని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. చర్చ నుంచి అధికార పక్షం పారిపోతుందని, ఎందుకీ భయం అని ఆయన ప్రశ్నించారు. తాము ఓ పాయింట్‌ను లేవనెత్తేందుకు ప్రొసీడింగ్‌లు ఇచ్చిమాని, 267 కింద నోటీసులు ఇచ్చినా చర్చ జరుగడం లేదన్నారు. సభను నడిపేందుకు ప్రయత్నించారా? అంటూ అధికారపక్షంపై మండిపడ్డారు. హెచ్‌ఏఎల్‌ 108 రాఫెల్‌ విమానాలను తయారు చేసేందుకు సిద్ధంగా ఉందని, కానీ మోదీ వాటిని ఫ్రాన్స్‌ నుంచి రెడీమేడ్‌గా తీసుకువచ్చారన్నారు. పండిట్‌ నెహ్రూ కాలం నుంచి కర్ణాటకలో ఎన్నో ప్రభుత్వ రంగాలున్నాయని, మోదీ కొత్తగా ఏమీ మ్యాజిక్‌ చేయలేదన్నారు.