OSCARS: ఉత్తమ నటుడిగా చరణ్, సహాయ నటుడిగా తారక్‌

విధాత‌: ఇప్పుడు అంతటా RRR మేనియా నడుస్తోంది. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం.. జపాన్ బాక్సాఫీస్‌తో పాటు అన్నిచోట్ల కాసుల వర్షం కురిపిస్తోంది. దాదాపు పాతికేళ్లుగా జపాన్‌లో చెక్కుచెదరకుండా అలాగే ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు మూవీ కలెక్షన్స్ రికార్డుని ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టేసింది. చెర్రీ, తారక్‌ల దెబ్బకు సూపర్ స్టార్ రజిని సైతం సైలెంట్‌గా తిల్లానా తిల్లానా అనుకుంటూ సైడ్ అయిపోయాడు. ముత్తు […]

OSCARS: ఉత్తమ నటుడిగా చరణ్, సహాయ నటుడిగా తారక్‌

విధాత‌: ఇప్పుడు అంతటా RRR మేనియా నడుస్తోంది. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం.. జపాన్ బాక్సాఫీస్‌తో పాటు అన్నిచోట్ల కాసుల వర్షం కురిపిస్తోంది. దాదాపు పాతికేళ్లుగా జపాన్‌లో చెక్కుచెదరకుండా అలాగే ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ ముత్తు మూవీ కలెక్షన్స్ రికార్డుని ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టేసింది.

చెర్రీ, తారక్‌ల దెబ్బకు సూపర్ స్టార్ రజిని సైతం సైలెంట్‌గా తిల్లానా తిల్లానా అనుకుంటూ సైడ్ అయిపోయాడు. ముత్తు సినిమా 400 జపనీస్ మిలియన్ డాలర్లు వసూలు చేయగా.. RRR రీసెంట్‌గానే ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పటికీ కలెక్షన్స్‌లో హౌస్‌ఫుల్‌తో రన్ అవుతుంది. అవార్డ్స్ పరంగా కూడా ఏ ఇండియన్ సినిమాకి గతంలో దక్కని గౌరవాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తోందీ చిత్రం.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజమౌళికి ఇటీవల న్యూయార్క్ క్రిటిక్స్ ఫిలిం సర్కిల్ ఉత్తమ దర్శకుడి అవార్డు లభించింది. ఇది చాలా ప్రతిష్టాత్మకం. హాలీవుడ్ చిత్రాల మధ్య మనం తెలుగు సినిమాకి సంబంధించి దర్శకుడు ఈ అవార్డును అందుకోవడం ఎవ్వరూ ఊహించని అపూర్వ సంఘటన.

ఇక ఇందులో ఒక హీరోగా నటించిన రామ్ చరణ్‌కి ఎన్‌డి‌టీవీ సంస్థ నిర్వహించిన ట్రూ లెజెండ్ అవార్డ్స్ ఈవెంట్లో ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు లభించింది. లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఎల్‌ఏ‌ఎఫ్‌సి ఏ సంస్థ 2022 గాను నిర్వహిస్తున్న అవార్డ్స్ ఈవెంట్‌లో రామ్ చరణ్‌ని ఉత్తమ నటుడిగా నామినేట్ చేసింది.. ఇది గొప్ప అచీవ్‌మెంట్ అని చెప్పాలి.

ఇక తారక్, చరణ్‌లు ఆస్కార్ అవార్డు నామినేషన్‌కు కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నారు. ఈ నామినేషన్స్‌లో ఉత్తమ నటుడిగా రాంచరణ్, ఉత్తమ సహాయ నటుడిగా ఎన్టీఆర్‌ని నామినేట్‌గా సూచిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇదే కేటగిరీలలో నామినేట్ అయ్యే అవకాశం ఉందని హాలీవుడ్ విశ్లేషకులు గట్టి నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈసారి RRR చిత్రం ద్వారా రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఆస్కార్ వేదికపై మన కీర్తి పతాకం ఎగురవేయడం ఖాయమనే అనిపిస్తోంది.