BRS మోసం పసిగట్టలేక పోయాం.. మన సత్తా ఏమిటో చూపిస్తాం: సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు
BRS బరిలోకి ఒంటరిగానా.. పొత్తులతోనా కాంగ్రెస్ స్పందించే తీరుపై నిర్ణయం నేడు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం 27 సీపీఎం రాష్ట్ర కార్యవర్గం భేటీ ఆ తరువాత ఉమ్మడి సమావేశం కమ్యూనిస్టు పార్టీ నేతల నిర్ణయం విధాత: "నమ్మించి మోసం చేశారు.. చివరి దాక పసిగట్టలేక పోయాం… కమ్యూనిస్టులకు జెండా పట్టే వాడు లేడంటారా.. మన సత్తా ఏమిటో చూపిద్దాం" అని కమ్యూనిస్టు పార్టీల నేతలు నిర్ణయించారు. అయితే కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తాడని చెబుతున్నా.. […]

BRS
- బరిలోకి ఒంటరిగానా.. పొత్తులతోనా
- కాంగ్రెస్ స్పందించే తీరుపై నిర్ణయం
- నేడు సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం
- 27 సీపీఎం రాష్ట్ర కార్యవర్గం భేటీ
- ఆ తరువాత ఉమ్మడి సమావేశం
- కమ్యూనిస్టు పార్టీ నేతల నిర్ణయం
విధాత: “నమ్మించి మోసం చేశారు.. చివరి దాక పసిగట్టలేక పోయాం… కమ్యూనిస్టులకు జెండా పట్టే వాడు లేడంటారా.. మన సత్తా ఏమిటో చూపిద్దాం” అని కమ్యూనిస్టు పార్టీల నేతలు నిర్ణయించారు. అయితే కేసీఆర్ మొదటి నుంచి మోసం చేస్తాడని చెబుతున్నా.. గుడ్డిగా ఎలా నమ్మారని అగ్రనేతలను నాయకులు నిలదీసినట్లు సమాచారం. ప్రపంచానికి మార్గం చూపే మనం.. ఒక బూర్జువా పార్టీ నేత మనల్ని మోసం చేస్తుంటే గ్రహించకుండా మోసపోతిమి.. ప్రజలను ఈ మోస కారులనుంచి ఎలా రక్షిస్తాం? అని ప్రశ్నించారని సమాచారం.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆరెస్‌కు మద్దతు ఇవ్వ వద్దని, కేసీఆర్ మోసం చేస్తాడని ఎంత చెప్పినా వినకుండా.. ఇప్పుడు పార్టీ పరువును బజారులో పెట్టారని విమర్శించారని తెలిసింది. బీఆరెస్‌తో పొత్తు వద్దని రాష్ట్ర కమిటీలలో 90 శాతం సభ్యులు చెప్పినా వినకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది.
ఈ ఒక్కసారికి మా మాట వినండని, ఇంతకాడికి తీసుకువస్తిరని నేతలు ప్రశ్నించినట్లు సమాచారం. కమ్యూనిస్టులకు జెండా పట్టే వారులేరని మంత్రి హరీశ్‌రావు అన్న వాఖ్యలపై ఈ పార్టీల నేతలు గుర్రుగా ఉన్నారు. మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సైతం పొత్తులెక్కడివని అంటుంటే ఎందుకు అప్పుడే నిలదీయలేదని అడిగారని తెలిసింది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే మద్దతు ఇవ్వడం సరైంది కాదని అన్నట్లు సమాచారం.
చర్చలకు పిలవకున్నా.. అర్థం కాలేదా?
కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన కేసీఆర్.. ఏనాడూ చర్చలకు పిలువకపోతే కనీసం అనుమానం కూడా రాకుండా ఎలా ఉన్నారని అన్నట్లు తెలిసింది. మన పార్టీ కార్యదర్శలకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే ఏనాడో తాము స్వంతంగా పోటీ చేస్తున్నామని ప్రకటించాల్సి ఉండేదని అభిప్రాయపడినట్టు సమాచారం. ఇదే సమయంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతామని నాడు అన్న కేసీఆర్ తీరు మారిందని ఆ తరువాత జరిగిన పరిణామాలను పరిశీలిస్తే అర్థం అవుతుందని, అయినా నిర్ణయం తీసుకోలేక పోయామని అన్నట్లు సమాచారం.
బీజేపీతో అవగాహనకు వచ్చారనే అనుమానాలకు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, అవినీతి, అక్రమాల కేసుల తీరు పరిశీలిస్తేనే అర్థమవుతుందని అన్నట్లు తెలిసింది. ఈక్రమంలో కవిత లిక్కర్ కేసు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. జరిగిన పరిణామాలపై తీవ్రంగా జరిగిన చర్చల తరువాత కమ్యూనిస్ట్‌ల సత్తా ఏమిటో బీఆరెస్‌కు చూపించాలని నేతలంతా ఒక నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆరెస్‌ను ఓడించాలని పిలుపు ఇవ్వాలని నిర్ణయించారని తెలిసింది.
ఇలా పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పిలుపులో భాగంగా తమతో కలిసి వచ్చే బీఎస్పీ, తెలంగాణ జనసమితి, ప్రజాపంథా తదితర పార్టీలు సంఘాలతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ పార్టీ విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరితే.. గౌరవ ప్రదంగా వ్యవహరిస్తే సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చినట్లు ఒక సీనియర్ నేత తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ స్పందించే తీరును బట్టి తమ స్పందన ఉంటుందని ఇంకో నేత చెప్పారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో తమ పార్టీ ఉందని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ తమతో కలిసి నడవడానికి సిద్ధపడితే కాదని ఎలా అంటామని మరో నేత తెలిపారు. కాంగ్రెస్ నాయకత్వం చొరవ చేసి పొత్తులకు సిద్దపడితే… తాము పోటీ చేయాలనుకున్న స్థానాల్లో బహుళ పోటీ ఉండదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని ఇంకోక నేత చెప్పారు.
ఏదైనా కాంగ్రెస్ అనుసరించే తీరును బట్టే పొత్తుల వ్యవహారం ఉంటుందని, తాము ఎవరితో సంబందం లేకుండానే బలమున్న స్థానాల్లో పోటీ చేస్తామని చెపుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించే విధానంతో పాటు పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఇవ్వడం కోసం బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం అవుతున్నది. 27వ తేదీన సీపీఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాలలో ఆయా పార్టీలు నిర్ణయం తీసుకొని మరోసారి ఉమ్మడి సమావేశం నిర్వహించి, అభ్యర్థులను ప్రకటించాలన్న నిర్ణయానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వచ్చాయి.