BRS : ప్రకటించిన 115 స్థానాలలో.. ఏ వర్గానికి.. ఎన్ని సీట్లంటే!
BRS 115లో ఓసీలకు 58, బీసీలకు 22, ఎస్సీలకు20, ఎస్టీలకు 12 మహిళలకు 7 స్థానాల కేటాయింపు ముదిరాజ్‌కు దక్కని సీటు విధాత: బీఆరెస్ తొలి జాబితా 115మంది అభ్యర్థుల్లో ఓసీలకు 58స్థానాలు కేటాయించారు. బీసీలకు 22, ఎస్సీలకు 20, ఎస్టీలకు 12, మైనార్టీలకు 3స్థానాలు కేటాయించారు. ఓసీలలో రెడ్లకు 40, వెలమకు 11, వైశ్యకు 1, బ్రాహ్మణులకు 1, కమ్మలకు 5 స్థానాలు కేటాయించారు. బీసీలలో మున్నూరుకాపులకు 10, యాదవ్‌లకు 5, గౌడలకు 4, బెస్తలకు […]

BRS
- 115లో ఓసీలకు 58, బీసీలకు 22,
- ఎస్సీలకు20, ఎస్టీలకు 12
- మహిళలకు 7 స్థానాల కేటాయింపు
- ముదిరాజ్‌కు దక్కని సీటు
విధాత: బీఆరెస్ తొలి జాబితా 115మంది అభ్యర్థుల్లో ఓసీలకు 58స్థానాలు కేటాయించారు. బీసీలకు 22, ఎస్సీలకు 20, ఎస్టీలకు 12, మైనార్టీలకు 3స్థానాలు కేటాయించారు. ఓసీలలో రెడ్లకు 40, వెలమకు 11, వైశ్యకు 1, బ్రాహ్మణులకు 1, కమ్మలకు 5 స్థానాలు కేటాయించారు.
బీసీలలో మున్నూరుకాపులకు 10, యాదవ్‌లకు 5, గౌడలకు 4, బెస్తలకు 1, వంజరలకు 1, పద్మశాలికి 1 స్థానాలు కేటాయించారు. ఎస్సీలలో మాలకు 8, మాదిగలకు 11, నేతకానిలకు 1స్థానం కేటాయించారు.
ఎస్టీలలో లంబాడలకు 7, ఆదివాసీలకు 5స్థానాలు కేటాయించారు. 12శాతం జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ఒక్క స్థానం ఇవ్వకపోవడం గమనార్హం.
బీఆరెస్ అభ్యర్థుల్లో ఏడుగురు మహిళలు
2018ఎన్నికల్లో నలుగురి మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా ముగ్గురు విజయం సాధించారు. ఈ దఫా ఏడుగురు మహిళలకు అవకాశం కల్పించారు.
వారిలో సిటింగ్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డికి, ఇల్లందులో హరిప్రియానాయక్‌కు, గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి ఓటమి పాలైన కోవా లక్ష్మికి, ములుగులో బాదే నాగజ్యోతికి టికెట్లు ఇచ్చారు.
ఖనాపూర్‌లో రేఖానాయక్‌కు టికెట్ నిరాకరించగా, కంటోన్మెంట్ స్థానంలో దివంగత సాయన్న కూతురు లాస్య నందితకు టికెట్ ఇచ్చారు.