అక్కడ పీఏనే మంత్రి.. అంతా తానై పని కానిచ్చేస్తున్న వైనం!
ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు విధాత: ఈ వీడియోలో కనిపిస్తున్నది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ పవన్ కుమార్ గౌడ్. ఆయన రాజకీయ ప్రసంగాలు దంచుతున్నారు ఏమిటి అనుకుంటున్నారా? అదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు కానుకలు ఇస్తున్న సంగతి తెలిసిందే. సహజంగా ఆ కానుకలు మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా స్థానిక కార్పొరేట్ పంపిణీ చేస్తారు. కానీ ఆయన పీఏ కం పీఆర్వోగా సర్వం తానే అయి […]

- ఏం జరుగుతుందని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలు
విధాత: ఈ వీడియోలో కనిపిస్తున్నది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ పవన్ కుమార్ గౌడ్. ఆయన రాజకీయ ప్రసంగాలు దంచుతున్నారు ఏమిటి అనుకుంటున్నారా? అదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ కుటుంబాలకు కానుకలు ఇస్తున్న సంగతి తెలిసిందే.
సహజంగా ఆ కానుకలు మంత్రి లేదా ఎమ్మెల్యే లేదా స్థానిక కార్పొరేట్ పంపిణీ చేస్తారు. కానీ ఆయన పీఏ కం పీఆర్వోగా సర్వం తానే అయి మంత్రి గారి పనులు కూడా కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఓ ప్రాంతంలో మంత్రి గారు పంచాల్సిన క్రిస్మస్ కానుకలను కూడా ఆయనే పంపిణీ చేస్తూ.. రాజకీయ నేత లెక్క ప్రసంగిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏ అధికారంతో ఆయన ఈ కానుకలు పంపిణీ చేశారు అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మంత్రికి తెలియకుండానే ఇది జరిగిందా? లేక ఆయన అనుమతితోనే ఆయన పంపిణీ చేశారా? అన్నది తెలియాల్సి ఉన్నది.
గతంలో దసరా సందర్భంగా వరంగల్‌లో అధికార పార్టీ నేత కోటి, కోటర్ పంపిణీ చేసిన వీడియో బైటికి రావడం దీనిపై ఎన్నికల కమిషన్ వివరణ కోరడం జరిగింది. ఇట్లా అధికార పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధుల పీఏల వ్యవహారశైలి ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అవుతున్నది.