SL vs PAK | రంజుగా శ్రీలంక Vs పాకిస్తాన్‌ మ్యాచ్.. గెలుపు ఎవ‌రిదంటే..!

SL vs PAK: ఇటీవ‌ల టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లు కూడా చాలా టెన్ష‌న్ పెట్టించాయి. చివ‌రి వ‌ర‌కు కూడా ఎవ‌రు గెలుస్తార‌నేది చెప్ప‌డం కొంత క‌ష్టంగా మారింది. మొద‌టి రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌లో గెలిచిన ఆసీస్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ ని క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయింది. దీంతో ఓట‌మిబాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ రెండు […]

  • By: sn    latest    Jul 20, 2023 7:40 AM IST
SL vs PAK | రంజుగా శ్రీలంక Vs పాకిస్తాన్‌ మ్యాచ్.. గెలుపు ఎవ‌రిదంటే..!

SL vs PAK: ఇటీవ‌ల టెస్ట్ మ్యాచ్‌లు కూడా ఎంత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మూడు టెస్ట్ మ్యాచ్‌లు కూడా చాలా టెన్ష‌న్ పెట్టించాయి. చివ‌రి వ‌ర‌కు కూడా ఎవ‌రు గెలుస్తార‌నేది చెప్ప‌డం కొంత క‌ష్టంగా మారింది. మొద‌టి రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌లో గెలిచిన ఆసీస్ మూడో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ ని క‌ట్ట‌డి చేయ‌లేక‌పోయింది. దీంతో ఓట‌మిబాట ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య నాలుగో టెస్ట్ జ‌రుగుతుంది. మ‌రోవైపు 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా శ్రీలంక పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండ‌గా, ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ సరిగ్గా ఏడాది తర్వాత తమ తొలి టెస్టు విజయాన్నిచ‌వి చూసింది.

తొలిటెస్ట్‌లో చివ‌రి రోజైన గురువారం (జులై 20) 133 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్‌ ఆరు వికెట్లు కోల్పోయి చేధించింది. స‌రిగ్గా ఏడాది కింద‌ట అంటే జులై 20, 2022లో పాకిస్థాన్ టెస్ట్ మ్యాచ్ గెల‌వ‌గా, మ‌ళ్లీ ఏడాది త‌ర్వాత సేమ్ డే రోజు మ్యాచ్ విన్ కావ‌డం విశేషం. అయితే గురువారం రోజు పాకిస్తాన్ గెల‌వాలంటే ఆ జ‌ట్టుకి 83 ప‌రుగులు అవ‌సరం కాగా, చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఆ స‌మ‌యంలో ఇమాముల్ హక్ హాఫ్ సెంచరీ చేయడంతోపాటు కెప్టెన్ బాబర్ ఆజం 24, తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన సాద్ షకీల్ 30 పరుగులు చేసి జట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

ఒక దశ‌లో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డ్డ పాక్‌కి ఇమాముల్ హాక్ మంచి విజయం అందించాడు. బాబర్ తో కలిసి నాలుగో వికెట్ కు 41 పరుగులు, సాద్ షకీల్ తో కలిసి ఐదో వికెట్ కు 43 పరుగులు విలువైన భాగ‌స్వామ్యం న‌మోదు చేశాడు. ఏడాది త‌ర్వాత పాకిస్తాన్ జట్టు విజ‌యం సాధించ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ధనంజయ డిసిల్వా (122) సెంచరీ చేయ‌డంతో శ్రీలంక 312 పరుగులు చేసింది. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్ లో 461 పరుగులు చేయడంతో 149 పరుగుల ఆధిక్యం రాగా, రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 279 పరుగులకు ఆలౌటైంది.