Palvai Sravanthi | పాల్వాయి స్రవంతికి మాతృవియోగం

Palvai Sravanthi విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: దివంగత నేత, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సతీమణి, మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి తల్లి పాల్వాయి సృజమని అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాల్వాయి స్రవంతి తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం […]

Palvai Sravanthi |  పాల్వాయి స్రవంతికి మాతృవియోగం

Palvai Sravanthi

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: దివంగత నేత, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సతీమణి, మునుగోడు కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి తల్లి పాల్వాయి సృజమని అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పాల్వాయి స్రవంతి తో పాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు గుత్తా అమిత్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు