పండిట్, పీఈటీల ప్రమోషన్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: MLC అలుగుబెల్లి

విధాత: పండిట్ పీఈటిల అప్ గ్రేడేషన్ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వడానికి గల కోర్టు అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో అలుగుబెల్లి మాట్లాడుతూ అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందుతుంటే పండిట్ లు, పీఇటీలు ప్రమోషన్లు లేక ఆవేదన చెందుతున్నారని అన్నారు. అదేవిధంగా రంగారెడ్డి-హైద్రాబాద్- మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల […]

  • By: krs    latest    Feb 12, 2023 5:04 AM IST
పండిట్, పీఈటీల ప్రమోషన్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి: MLC అలుగుబెల్లి

విధాత: పండిట్ పీఈటిల అప్ గ్రేడేషన్ పోస్టులకు ప్రమోషన్లు ఇవ్వడానికి గల కోర్టు అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో టీఎస్ యుటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో అలుగుబెల్లి మాట్లాడుతూ అన్ని సబ్జెక్టుల ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందుతుంటే పండిట్ లు, పీఇటీలు ప్రమోషన్లు లేక ఆవేదన చెందుతున్నారని అన్నారు.

అదేవిధంగా రంగారెడ్డి-హైద్రాబాద్- మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల జరగబోయే ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఎస్ యూటీఎఫ్ సంఘం బలపర్చిన అభ్యర్థి మాణిక్ రెడ్డి ని గెలిపించాలని తద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఎక్కువ ఎమ్మెల్సీలు ఉంటారని ఉపాధ్యాయ సమస్యల సాధనకై జరిగే పోరాటంలో వీరు ముందు ఉంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్ రెడ్డి, జి నాగమణి టీఎస్ యుటిఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, ఉపాధ్యక్షులు బక్క శ్రీనివాసా చారి, అరుణ గార్లు కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, అరుణ జిల్లా కార్యదర్శులు రామలింగయ్య, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ, వెంకన్న, మురళయ్య, చిన్న వెంకన్న, పి.సైదులు, నరసింహమూర్తి , వై.సైదులు, వరలక్ష్మి మరియు వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.