సహచర జవాన్లపై ఏకే 47తో కాల్పులు.. ఇద్దరు మృతి
Gujarat Elections | గుజరాత్‌లోని పోరుబందర్‌లో ఘోరం జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విధులకు వచ్చిన ఓ జవాన్ ఏకే 47తో సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆ ఇద్దరు జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోరుబందర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎం శర్మ స్పందించారు. మణిపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న […]

Gujarat Elections | గుజరాత్‌లోని పోరుబందర్‌లో ఘోరం జరిగింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల విధులకు వచ్చిన ఓ జవాన్ ఏకే 47తో సహచర జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న ఆ ఇద్దరు జవాన్లను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోరుబందర్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎం శర్మ స్పందించారు. మణిపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇండియా రిజర్వ్ బెటాలియన్ జవాన్లు.. గుజరాత్ ఎన్నికల బందోబస్తుకు వచ్చారని తెలిపారు. డ్యూటీలో యాక్టివ్‌గా లేవని ప్రశ్నించినందుకు జవాన్ ఇనాచసింగ్హ్ తన సహచర జవాన్లపై ఏకే 47తో కాల్పులు జరిపినట్లు తెలిసిందన్నారు. మృతి చెందిన జవాన్లను తోయిబా సింగ్, జితేంద్ర సింగ్‌గా గుర్తించామన్నారు. గాయపడ్డ వారిని చోరాజిత్, రోహికనా అని పేర్కొన్నారు. ఈ ఐదుగురు మణిపూర్‌కు చెందిన వారే అని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కాల్పుల ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.