గిఫ్ట్‌లతో ఆకట్టుకుంటున్న పవన్
విధాత: పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటాడు. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు. నిజ జీవితంలో ఆయన వేసుకునే డ్రెస్సులు, వాడే వస్తువులు అన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇక ఆయన ఇతరులకు ఇచ్చే గిఫ్ట్‌లు కూడా మరీ మరీ సింపుల్. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ వేసవి కానుకగా పరిశ్రమలోని తన సన్నిహితులకు మామిడిపండ్లు పంపిస్తుంటాడు. తన ఫామ్ హౌస్‌లో పండిస్తున్న ఆర్గానిక్ మామిడి పండ్లను ఆయన తన అనుచరులకు అందిస్తూ వారికి కలకాలం గుర్తిండిపోయే చిరు […]

విధాత: పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉంటాడు. సింప్లిసిటీ మెయింటైన్ చేస్తాడు. నిజ జీవితంలో ఆయన వేసుకునే డ్రెస్సులు, వాడే వస్తువులు అన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇక ఆయన ఇతరులకు ఇచ్చే గిఫ్ట్‌లు కూడా మరీ మరీ సింపుల్. ప్రతి ఏడాది పవన్ కళ్యాణ్ వేసవి కానుకగా పరిశ్రమలోని తన సన్నిహితులకు మామిడిపండ్లు పంపిస్తుంటాడు. తన ఫామ్ హౌస్‌లో పండిస్తున్న ఆర్గానిక్ మామిడి పండ్లను ఆయన తన అనుచరులకు అందిస్తూ వారికి కలకాలం గుర్తిండిపోయే చిరు గిఫ్ట్‌లను అందిస్తుంటాడు. ఈ మామిడి పండ్లు చాలా టేస్ట్‌గా ఉంటాయని.. అందుకే ఏడాదంతా పవన్‌ని తాము తలుచుకుంటూ ఉంటామని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.
ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. ఈ సందర్భంగా కూడా పవన్ కొన్ని గిఫ్ట్‌లను తనతో పని చేసిన దర్శకులకు పంపించాడు. అలాగే తన సన్నిహితులకు వాటిని పంపాడు. ఈ గిఫ్ట్ ప్యాక్ పైన పవన్ తన పేరుతో పాటు తన భార్య పేరును కూడా మెన్షన్ చేశాడు. ఈ గిఫ్ట్ అందుకున్న వారిలో వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఒకరు. తాజాగా వేణు శ్రీరామ్ భార్య ఈ గిఫ్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే చిత్రం చేస్తున్నాడు. పీరియాడికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ సముద్రపు దొంగగా, వజ్రాల గజదొంగగా రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటివరకు 60 శాతం పూర్తయింది. ఇటీవల రామోజీ ఫిలిం సిటీ లో భారీ యాక్షన్స్ చిత్రీకరించారు. దాంతో యాక్షన్ పాటు మొత్తం పూర్తయింది. మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవన్.
దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. దాని తర్వాత సాహో దర్శకుడు సుజిత్‌తో ఓ సినిమా కమిట్ అయ్యాడు. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. దీంతోపాటు ఓ తమిళ మూవీని నటుడు దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వంలో చేయబోతున్నాడు. మరోవైపు పవన్ రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు.
Extremely contented to receive this Christmas present from @PawanKalyan garu❤️ Thank you very much sir