హరిహర వీరమల్లు మొదలుపెట్టాడు

విధాత: చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా అప్‌డేట్ వచ్చింది. ఈ మధ్య పొలిటికల్‌గా బిజీగా మారిన పవన్ కల్యాణ్.. మళ్లీ సినిమా షూటింగ్స్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన హీరోగా, దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఎపిక్ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కొంత మేర షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఈ సినిమా షూటింగ్ […]

  • By: krs    latest    Oct 01, 2022 1:20 PM IST
హరిహర వీరమల్లు మొదలుపెట్టాడు

విధాత: చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా అప్‌డేట్ వచ్చింది. ఈ మధ్య పొలిటికల్‌గా బిజీగా మారిన పవన్ కల్యాణ్.. మళ్లీ సినిమా షూటింగ్స్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఆయన హీరోగా, దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఎపిక్ చిత్రంగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్‌ని ముందుకు తీసుకెళ్లేందుకు పవన్ సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి కొంత మేర షూటింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.

పవన్ కల్యాణ్ పొలిటికల్‌గా బిజీ కావడంతో.. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా మళ్లీ సెట్స్‌పైకి వెళుతుందనేలా.. తాజాగా చిత్ర యూనిట్ ఓ వీడియోని, కొన్ని పొటోలను విడుదల చేసింది.

ఇది ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సంబంధించి ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌గా మేకర్స్ చెబుతున్నారు. ఈ ఫొటోలలో సినిమాలో నటించే వారందరి చేతిలో పేపర్లు ఉన్నాయి. దర్శకుడు క్రిష్ సీన్స్‌కు సంబంధించి వివరణ ఇస్తున్నారు.

అయితే ఎప్పుడూ లేనిది.. పవన్ కల్యాణ్ కూడా ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడమే ఇప్పుడందరూ ఆశ్చర్య కరంగా భావిస్తున్నారు. అంతేకాదండోయ్.. ఈ వర్క్‌షాప్ ఏమోగానీ.. ఆ వదిలిన పిక్స్‌లో పవన్ కల్యాణ్ లుక్‌కి అంతా ఫిదా అవుతున్నారు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. అలా ఉంది మరి లుక్.

భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి వర్క్‌షాప్ అనేది ఎంతగానో సహాయపడుతుందని దర్శకుడు భావించడంతో పాటు.. చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరూ ప్రేక్షకులకు ఓ పరిపూర్ణమైన చిత్రాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ వర్క్‌షాప్ తలపెట్టినట్లుగా తెలుస్తోంది.

దసరా నవరాత్రులు సందర్భంగా శుక్రవారం ఉదయం వేకువ జామున సరస్వతి అమ్మవారికి పూజాదికాలు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం చిత్ర బృందం ఈ వర్క్ షాప్‌కు సమాయత్తమైంది. ఈ వర్క్‌షాప్‌కి సంబంధించి చిత్రబృందం విడుదల చేసిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయంటే నమ్మాలి మరి.

ఈ వర్క్‌షాప్‌కు విషయాన్ని పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు క్రిష్ ముందే చర్చించినట్లుగా తెలుస్తోంది. అందుకే.. అంత పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ.. షూటింగ్‌కి వెళ్లే ముందు తాను మరియు తన తోటి నటీనటులు పాత్రల గురించి మరింత అవగాహన పొందేందుకు మరియు స్క్రిప్ట్ గురించి బాగా చర్చించుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వర్క్‌షాప్‌కు వెంటనే పవన్ కల్యాణ్ అంగీకరించాడని చిత్రయూనిట్ తెలుపుతోంది.

వర్క్‌షాప్ ముగిశాక అక్టోబర్ రెండో వారం తర్వాత నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని నిర్మాత ప్రకటించారు.మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై పవన్ కల్యాణ్ ‘ఖుషి’ చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.