Pawan Kalyan: బ్రో మూవీలో పవన్ కళ్యాణ్ చేతికి ఉన్న లేబర్ లైసెన్స్ వెనక చాలానే నడిచిందిగా..!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉన్న క్రేజ్ వేరు. ఆయన పేరు చెబితే అభిమానులకి పూనకం వచ్చేస్తుంది. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉంటారు. ఆయన ధరించే దుస్తులు, వాడే, కార్లు ,వేసుకునే షూస్ ఇలా ప్రతి ఒక్కదానిని నిశితంగా గమనిస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో బ్రో అనే సినిమా తెరకెక్కగా, ఈ సినిమా మంచి విజయం […]

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరుకి ఉన్న క్రేజ్ వేరు. ఆయన పేరు చెబితే అభిమానులకి పూనకం వచ్చేస్తుంది. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తూ ఉంటారు. ఆయన ధరించే దుస్తులు, వాడే, కార్లు ,వేసుకునే షూస్ ఇలా ప్రతి ఒక్కదానిని నిశితంగా గమనిస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో బ్రో అనే సినిమా తెరకెక్కగా, ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో పవన్ గెటప్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకి పిచ్చగా నచ్చేసింది. బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ తన పాత సినిమాల నుంచి రెఫరెన్సెస్ తీసుకొని ట్రై చేసినట్టు అర్ధమైంది.
తమ్ముడు సినిమాలో వయ్యారి భామ అంటూ పాట పాడుతూ హీరోయిన్ వెనక పడే కూలి పాత్ర బ్రో సినిమాలో ఉండగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక పవన్ కళ్యాణ్ కూలి వేషం లో కనిపించినప్పుడు ఆయన చేతికి ఒక లేబర్ లైసెన్స్ లాంటి బిళ్ళని ప్రేక్షకులు గమనించారు. దీనిపై జనసేన యొక్క లోగో లో ఉండే చక్రం కనిపించడంతో దీని గురించి పూర్తిగా ఆరాలు తీయడంతో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఈ బిళ్లని ఆంధ్రప్రదేశ్ లో గల తెనాలి పట్టణం లోఉండే ఫేమస్ స్వర్ణకారుల దగ్గర బంగారం తో దీనిని చేయించినట్టు తెలుస్తుంది. సౌమరౌతు బ్రహ్మం, అనురాధ అనే స్వర్ణకారులు సిల్వర్ అండ్ గోల్డ్ వర్క్ షాప్ తెనాలి లో నడిపిస్తుండగా, వారి దగ్గరే ఈ బిళ్ళ తయారు చేయించారని అంటున్నారు.
బ్రో సినిమా కోసం వారు లైసెన్స్ బిళ్లని తయారు చేశారని వార్త బయటకు రాగానే , ఇప్పుడు అందరు వారి గురించి ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ఓవర్‌నైట్ స్టార్స్ గా మారారు. పలు ఛానెల్స్ వారితో ఇంటర్వ్యూలు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పవన్ కళ్యాణ్ తన సినిమా ద్వారా ఎప్పుడు ఏదో ఒక టాలెంట్‌ని పరిచయం చేస్తూనే ఉంటారు. భీమ్లా నాయక్ సినిమాతో మొగిలయ్యని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సినిమా తర్వాతనే ఆయనకు పద్మశ్రీ అవార్డ్ కూడా దక్కింది.