ఆ పెంట్ హౌజ్ ధర రూ.230 కోట్లు
-దేశంలోనే ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్ -స్టాంప్ డ్యూటీనే రూ.13.83 కోట్లు విధాత: ఓ పెంట్ హౌజ్ ధర ఏకంగా రూ.230 కోట్లు పలికింది. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలోని సంపన్న నివాస ప్రాంతాల్లో ఒకటైన వొర్లీ ఈ రికార్డుకు వేదికైంది. ఇక్కడ ప్రముఖ రియల్టీ డెవలపర్ ఒబెరాయ్ రియల్టీ.. త్రీ సిక్స్‌టీ వెస్ట్ పేరుతో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ క్రమంలోనే ఇందులోని పెంట్ హౌజ్‌ను రూ.230 కోట్లు పెట్టి కొన్నారు. బహుళ వ్యాపారాలు […]

-దేశంలోనే ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్
-స్టాంప్ డ్యూటీనే రూ.13.83 కోట్లు
విధాత: ఓ పెంట్ హౌజ్ ధర ఏకంగా రూ.230 కోట్లు పలికింది. దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలోని సంపన్న నివాస ప్రాంతాల్లో ఒకటైన వొర్లీ ఈ రికార్డుకు వేదికైంది. ఇక్కడ ప్రముఖ రియల్టీ డెవలపర్ ఒబెరాయ్ రియల్టీ.. త్రీ సిక్స్‌టీ వెస్ట్ పేరుతో ఓ లగ్జరీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ క్రమంలోనే ఇందులోని పెంట్ హౌజ్‌ను రూ.230 కోట్లు పెట్టి కొన్నారు.
బహుళ వ్యాపారాలు చేస్తున్న వెల్‌స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఈ పెంట్ హౌజ్‌ను అత్యధిక ధర చెల్లించి సొంతం చేసుకున్నారు. దీంతో దేశంలోనే ఇది అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్ డీల్‌గా నిలిచింది. ఇక ఈ నెల 8న ఈ విక్రయం నమోదైంది. ఇప్పటికే ఇదే ప్రాజెక్టులో డీమార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం, సమీప బంధువులు రూ.1,238 కోట్లతో 28 ఫ్లాట్లను కొనుగోలు చేయడం గమనార్హం.
ఇదిలావుంటే ప్రాజెక్టులోగల టవర్ బీలోని 63వ అంతస్తుపై ఈ పెంట్ హౌజ్ ఉన్నది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ప్రకారం దీని కార్పెట్ ఏరియా 29,885 చదరపు అడుగులు. టెరస్ ఏరియా 4,815 చదరపు అడుగులుండగా, అదనపు ఏరియా 411 చదరపు అడుగులు, ఫ్రీ సేల్ లాండ్ 13,951 చదరపు అడుగులుగా ఉన్నది. దీనికి 14 కార్ పార్కింగ్ స్పేస్‌లున్నాయి.