Peoples March | 500 కిలోమీటర్లు దాటిన భట్టి పాదయాత్ర.. కేక్ కట్ చేయించిన పొన్నాల
Peoples March విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం నర్మెట్ట మండలానికి చేరుకున్న సందర్భంగా 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 43వ రోజు శుక్రవారం నాటికి జనగామ జిల్లా నర్మేట గ్రామానికి 502.5 కిలోమీటర్లు పూర్తయింది. బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, […]

Peoples March
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం నర్మెట్ట మండలానికి చేరుకున్న సందర్భంగా 500 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది.
మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం పిప్పిరి గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 43వ రోజు శుక్రవారం నాటికి జనగామ జిల్లా నర్మేట గ్రామానికి 502.5 కిలోమీటర్లు పూర్తయింది.
బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్పూర్, జనగామ, నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది.
మార్చి 16న ప్రారంభమైన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్లు, ఆసిఫాబాద్ జిల్లాలో 96 కిలోమీటర్లు, మంచిర్యాల జిల్లాలో 134 కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లాలో 75 కిలోమీటర్లు, కరీంనగర్ జిల్లాలో 43 కిలోమీటర్లు, హనుమకొండ జిల్లాలో 47 కిలోమీటర్లు, జనగామ జిల్లాలో 25.5 కిలోమీటర్లు పూర్తిచేసుకుని శుక్రవారం రాత్రి నాటికి 502.5 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది.
ఈ సందర్భంగా కొర్రి తండా వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కేక్ కట్ చేయించారు.