అక్కడ.. కిలో చికెన్‌ రూ.325, ఉల్లిగడ్డ రూ.890

విధాత: ఫిలిప్పీన్స్‌లో ఉల్లి కొరత జనాన్ని కన్నీటి పర్యంతం చేస్తున్నది. కిలో చికెన్‌ ధర కన్నా.. కిలో ఉల్లిపాయల ధర ఎక్కువైంది. కిలో ఉల్లి ధర రూ.890 ఉంటే, కేజీ చికెన్‌కు రూ.325మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో జనం ఎక్కడ దొరుకుతున్నాయంటే అక్కడికి ఉల్లి కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వంటకాల్లో అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందట ఉల్లి. దీన్ని బట్టి వంటకాల్లో ఉల్లి ప్రాధాన్యం తెలుస్తున్నది. ఫిలిప్పీన్స్‌లోనూ అక్కడి సంప్రదాయ వంటకాలు మొదలు బర్గర్లదాకా […]

  • By: krs    latest    Jan 19, 2023 5:27 PM IST
అక్కడ.. కిలో చికెన్‌ రూ.325, ఉల్లిగడ్డ రూ.890

విధాత: ఫిలిప్పీన్స్‌లో ఉల్లి కొరత జనాన్ని కన్నీటి పర్యంతం చేస్తున్నది. కిలో చికెన్‌ ధర కన్నా.. కిలో ఉల్లిపాయల ధర ఎక్కువైంది. కిలో ఉల్లి ధర రూ.890 ఉంటే, కేజీ చికెన్‌కు రూ.325మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో జనం ఎక్కడ దొరుకుతున్నాయంటే అక్కడికి ఉల్లి కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

వంటకాల్లో అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందట ఉల్లి. దీన్ని బట్టి వంటకాల్లో ఉల్లి ప్రాధాన్యం తెలుస్తున్నది. ఫిలిప్పీన్స్‌లోనూ అక్కడి సంప్రదాయ వంటకాలు మొదలు బర్గర్లదాకా అన్నింటిలో ఉల్లిగడ్డలను తప్పక, విరివిగా వినియోగిస్తారు.

ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా దేశంలో ఏర్పడ్డ ఉల్లి కొరత ఈ మధ్య కాలంలో మరింత తీవ్రమైంది. కిరాణా దుకాణాలు మొదలు పెద్ద మాల్‌లలో కూడా ఉల్లి గడ్డ దొరకటం లేదు.

ఫిలిప్పీన్స్‌లో ఏర్పడ్డ ఉల్లి కొరతపై అక్కడి సోషల్‌ మీడియా, ప్రచార మాద్యమాల్లో వ్యంగంగా బంగారం కన్నా ఉల్లిగడ్డ ప్రియం అయిపోయిందని విపరీత ప్రచారం జరుగుతున్నది. ఫిలిప్పీన్స్‌లో ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలనుకుంటే.. ఉల్లిగడ్డను ఇచ్చే పరిస్థితి ఉన్నదని చెప్తున్నారు.

అంతే కాకుండా… విహార యాత్రలకు విదేశాలకు వెళ్లిన వారు చాక్‌లెట్లు, ఇతర విలువైన పరికరాల బదులు ఉల్లిపొడిని తెచ్చుకొంటున్నారని చెప్పుకొస్తున్నారు.

ఉల్లి కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఈ సారి ఉల్లి దిగుబడి తక్కువగా ఉంటుందని ముందస్తు సమాచారం ఉన్నా అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ ప్రత్యామ్నాయ పరిష్కారాలు చేయలేదని, దిగుమతుల గురించి ఆలోచించలేదని విమర్శిస్తున్నారు.

అలాగే.. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో వచ్చిన తుపాను కారణంగా ఉల్లి తోటలు తీవ్రంగా నష్టపోయాయి. దిగుమతి గణనీయంగా తగ్గిపోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోంచే దేశంలో ఉల్లి కొరత ఏర్పడింది.

ప్రస్తుత పాలకుడు అన్నింటా విఫలమయ్యాడని ప్రజలు విమర్శిస్తున్నారు. 1980, 90 దశకాల్లో ఈయన తండ్రి మార్కోస్‌ కూడా ఇలాగే ప్రజల అవసరాలను పట్టించుకోకుండా నియంతగా వ్యవహరించటం కారణంగానే ప్రజల తిరుగుబాటులో విదేశాలకు పారిపోయాడు.

1991లో విదేశాల నుంచి సీనియర్‌ మార్కోస్‌ కుమారుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ తిరిగి వచ్చి రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ .. దేశాధినేత అయ్యాడు. అధికారంలోకి వచ్చేందుకు తన తండ్రి మార్కోస్‌ కాలం నాటి సర్ణయుగం తెస్తానని చెప్పుకొచ్చారు. స్వర్ణయుగం అంటే ఇదేనా..? ఉల్లిగడ్డ బంగారం అయిపోవడమేనా..? అని ప్రశ్నిస్తున్నారు.