పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

విధాత‌: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ‌పెంచికలపాడు గ్రామంలో పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందింది. వివరాళ్లోకి వెళితే గురువారం భార్యాభర్తలు వంగూరు బాలయ్య, వంగూరు లక్ష్మి, కొడుకు సందీప్‌తో కలిసి గొర్రెల మేపు కోవడానికి పంట పొలాలకు వచ్చారు. వాతావరణంలో మార్పులతో మధ్యాహ్న మూడు నాలుగు గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. అదే సమయంలో భర్త, కొడుకు చూస్తుండగానే ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా లక్ష్మిపై పిడుగు పడి అక్కడే మృతి […]

పిడుగు పడి గొర్రెల కాపరి మృతి

విధాత‌: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ‌పెంచికలపాడు గ్రామంలో పిడుగు పడి గొర్రెల కాపరి మృతి చెందింది. వివరాళ్లోకి వెళితే గురువారం భార్యాభర్తలు వంగూరు బాలయ్య, వంగూరు లక్ష్మి, కొడుకు సందీప్‌తో కలిసి గొర్రెల మేపు కోవడానికి పంట పొలాలకు వచ్చారు.

వాతావరణంలో మార్పులతో మధ్యాహ్న మూడు నాలుగు గంటల సమయంలో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. అదే సమయంలో భర్త, కొడుకు చూస్తుండగానే ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా లక్ష్మిపై పిడుగు పడి అక్కడే మృతి చెందింది. మృతురాలు వంగూరు లక్ష్మిది వనపర్తి జిల్లా చిట్యాల గ్రామం.. ఈ సంఘటనతో రెండు గ్రామాలలో విషాదం నింపింది.