Manipur violence | మణిపూర్ హింసాత్మక ఘటనలు.. ప్రధాని మోదీ ఆగ్రహం
PM Modi నిందితులను వదిలిపెట్టం.. దోషులను త్వరలో శిక్షిస్తాం ఆ అమానుష ఘటన సమాజానికి సిగ్గుచేటు మణిపూర్ కుమార్తెల ఘటన క్షమించలేం ఈ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేం చేపడతాం సుప్రీంకోర్టు విధాత: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ గురువారం స్పందించారు. ఈ అమానుష ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో […]

PM Modi
- నిందితులను వదిలిపెట్టం.. దోషులను త్వరలో శిక్షిస్తాం
- ఆ అమానుష ఘటన సమాజానికి సిగ్గుచేటు
- మణిపూర్ కుమార్తెల ఘటన క్షమించలేం
- ఈ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు
- ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేం చేపడతాం సుప్రీంకోర్టు
విధాత: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని మోదీ గురువారం స్పందించారు. ఈ అమానుష ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని అన్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని తెలిపారు. మణిపూర్ ఘటన సమాజానికి తలవంపులు తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మణిపూర్ కుమార్తెలకు ఏం జరిగినా క్షమింబోమని, దోషులను త్వరలోనే శిక్షిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. గురువారం వర్షాకాల సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. @మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘటన పట్ల బాధగా ఉన్నది. జరుగుతున్నది ఏ సమాజానికైనా అవమానకరం* అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
ఇది దేశానికి అవమానకరం
@ఏ సమాజానికి అయినా ఈ సంఘటన సిగ్గుచేటు. ఇది దేశానికి అవమానకరం. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలి* అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఇలాంటి దారుణలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదని హెచ్చరించారు. ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించబోమని స్పష్టం చేశారు.
నిందితుడు హెరాదాస్‌గా ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి, రోడ్డుపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోతో కూడిన కేసులో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకున్నది. ప్రధాన నిందితుడిని మణిపూర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. హెరాదాస్‌గా గుర్తించబడిన 32 ఏళ్ల నిందితుడిని గురువారం ఉదయం తౌబల్ జిల్లా నుండి అరెస్టు చేశారు.
మణిపూర్ వీడియోపై స్పందించిన సుప్రీంకోర్టు
మణిపూర్ వీడియో వైరల్ ఘటనపై సుప్రీంకోర్టు స్పందించింది. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను బలవంతంగా నగ్నంగా ఊరేగించిన వీడియో తనను కలచివేసిందని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం సూచించింది. ’’ @మత కలహాల ప్రాంతంలో మహిళలను సాధనంగా వాడుకోవడం.. రాజ్యాంగ దుర్వినియోగం చేయడంలో ఇది అత్యంత దారుణం.. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేం చర్యల తీసుకుంటాం’’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ చెప్పారు.