ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు
విధాత; ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 12న రామగుండం రానున్నారు. ఎరువుల ప్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. రూ. 6,120 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం పునరుద్దరించింది. అందులో గత ఏడాది మార్చ్ లోనే ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఆధారితంగా రోజుకు 2200టన్నుల అమ్మోనియా, 3850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే విధంగా పునరుద్ధరించాలని నిర్ణయించిన […]

విధాత; ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 12న రామగుండం రానున్నారు. ఎరువుల ప్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. రూ. 6,120 కోట్లతో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేంద్రం పునరుద్దరించింది. అందులో గత ఏడాది మార్చ్ లోనే ఎరువుల ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ఆధారితంగా రోజుకు 2200టన్నుల అమ్మోనియా, 3850 టన్నుల యూరియా ఉత్పత్తి చేసే విధంగా పునరుద్ధరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని పనులను 2015లో ప్రారంభించగా, 2016 ఆగస్టు 7వ తేదీన గజ్వేల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
రూ.5,254కోట్ల అంచనాలతో మొదలుపెట్టిన ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కరోనా, గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణాల జాప్యంతో రూ.1084 కోట్లు అదనంగా పెరిగి, రూ.6338 కోట్లకు చేరింది. ఆర్‌ఎఫ్‌సీఎల్ నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర గడుస్తున్నది.
గత ఏడాది మార్చి 22వ తేదీ నుంచి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొదటి ఏడాది పరిశ్రమకు 759 కోట్ల నష్టం వచ్చినప్పటికీ, ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రూ.67 కోట్లతో లాభాల బాటలోకి అడుగుపెట్టింది. ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి అయ్యే యూరియాలో సగం తెలంగాణ రాష్ట్రానికే కేటాయిస్తున్నారు. ఈ పరిశ్రమను పలుసార్లు ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభించనున్నారనే వార్తలు వెలువడినప్పటికీ అనివార్య కారణాల వల్ల ప్రధాని పర్యటన ఖరారు కాలేదు.
వచ్చేనెల నవంబరు 12న ప్రధాని నరేంద్ర మోదీ ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారని ఢిల్లీ అధికార వర్గాలు సూచనప్రాయంగా ప్రకటించాయి. దీంతో నాలుగు రోజుల క్రితం రామగుండం కమిషనరేట్ పోలీసులు ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ను ఒకసారి పరిశీలించారు.
ప్రధాని రాకకు ఒక రూట్‌మ్యాప్‌ను రూపొందించి ప్రధాని కార్యాలయానికి పంపించారు. శనివారం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభానికి ప్రధాని రానుండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.
అధికారిక కార్యక్రమం కావడంతో ప్రధాని సభను మహాత్మాగాంధీ స్టేడియంలోనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలోగల ఈ స్టేడియంలో 10వేల మంది వరకు కూర్చునేందుకు వీలుగా ఉంటుందని అంచనా. ఒకవేళ జన సమీకరణ చేయాల్సి వస్తే మాత్రం గోదావరిఖనిలోగల జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సభను నిర్వహించాల్సి ఉంటుంది. భద్రతా దృష్ట్యా ఎన్టీపీసీ స్టేడియంలోనే సభను నిర్వహించే అవకాశాలు కనబడుతున్నాయి.