ఉమ్మడి మెదక్‌లో రాజకీయ కలకలం.. చైర్మన్లపై వెల్లువెత్తుతున్న అసమ్మతి!
మురళి యాదవ్ టార్గెట్ గా నర్సాపూర్ మున్సిపల్ రాజకీయాలు.. అవిశ్వాస తీర్మానం కోసం అంతా సిద్దం…. సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట్, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో ముసలం అవిశ్వాసానికి సిద్దమవుతున్న తూప్రాన్ మున్సిపల్ కన్సిలర్లు… విధాత, మెదక్ బ్యూరో: బీఆర్ ఎస్ పార్టీ, సీఎం కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీకి రాజీనామా చేసిన బీఆర్ ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ బీజేపీలో కేంద్ర మంత్రి ఉపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. […]

- మురళి యాదవ్ టార్గెట్ గా
- నర్సాపూర్ మున్సిపల్ రాజకీయాలు..
- అవిశ్వాస తీర్మానం కోసం అంతా సిద్దం….
- సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట్, సంగారెడ్డి మున్సిపాలిటీల్లో ముసలం
- అవిశ్వాసానికి సిద్దమవుతున్న తూప్రాన్ మున్సిపల్ కన్సిలర్లు…
విధాత, మెదక్ బ్యూరో: బీఆర్ ఎస్ పార్టీ, సీఎం కెసిఆర్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీకి రాజీనామా చేసిన బీఆర్ ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మురళీ యాదవ్ బీజేపీలో కేంద్ర మంత్రి ఉపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరారు. రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు ముఖ్య అనుచరుడుగా కొనసాగిన వ్యక్తి పార్టీ మారడంపై పార్టీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ జరిగిన విషయం విదితమే. మెదక్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ ఏర్రగొల్ల రాజమణి మురళి యాదవ్ భర్త, ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు.
అయితే ఇప్పుడు మురళి యాదవ్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళ కమిషన్ చైర్మన్ సునితా లక్ష్మారెడ్డి లతో బీఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్ళి నట్లు తెలుస్తుంది. 15 మంది వార్డు కౌన్సిలర్ల కు గాను 9 మంది బీఆర్ ఎస్ పార్టీ వ్యక్తులు కాగా చైర్మన్ మురళి యాదవ్ తో సహా 6 గురు బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఉన్నారు.
అవిశ్వాసం పెట్టేందుకు 8 మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా బీఆర్ ఎస్‌కు 9 మంది ఉన్నారు. ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న నయీం సునితారెడ్డి వర్గంగా కొనసాగుతున్నారు. చైర్మన్ పదవి ఆశించి భంగపడిన 1 వవార్డు కౌన్సిలర్ అశోక్ గౌడ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. మురళియాదవ్ బీఆర్ ఎస్ పార్టీ లో ఉన్నప్పుడు మంత్రి హరీష్ రావు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. అందుకే ఆయనకు మున్సిపల్ చైర్మన్ పదవి దక్కింది.
సంగారెడ్డి మున్సిపల్‌లోనూ అవిశ్వాసం…
సంగారెడ్డి మున్సిపల్ 38మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే చైర్మన్ బొంగుల విజయలక్ష్మిని కుర్చీ దించేందుకు 23 మంది కౌన్సిలర్లు అవిశ్వాసం నోటీస్ పై సంతకాలు పెట్టి సంగారెడ్డి కలెక్టరేట్లో అందించారు. దీంతో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల కు పదవి గండం పొంచి ఉంది.
సదాశివపేట మున్సిపల్ లో..
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ లో కూడా ముసలం పుట్టింది. సదాశివపేట మున్సిపల్ లో 26 వార్డులు ఉండగా బీఆర్ ఎస్ పార్టీకి చెందిన పి.జయమ్మ చైర్మన్‌గా ఉంది. ఇక్కడ కూడా 16 మంది కౌన్సిలర్లు అసమ్మతి రాగం అందుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజక వర్గంలో, తూప్రాన్ మున్సిపల్ లో సైతం అసమ్మతి పాట పాడుతున్నారని సమాచారం. అయితే విషయం నోటీస్ దాకా పోతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఏది ఏమైనా ఉమ్మడి మెదక్‌లో మాత్రం చైర్మన్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.