రాహుల్ పాదయాత్రలో సినీ నటి పూనమ్ కౌర్
విధాత: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 52 వ రోజుకు చేరుకోగా, తెలంగాణలో 4వ రోజు పాదయాత్ర నేటి ఉదయం ప్రారంభమైంది. రాహుల్ పాదయాత్రలో టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారు. చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్ రాహుల్ […]

విధాత: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 52 వ రోజుకు చేరుకోగా, తెలంగాణలో 4వ రోజు పాదయాత్ర నేటి ఉదయం ప్రారంభమైంది. రాహుల్ పాదయాత్రలో టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. పాదయాత్రలో రాహుల్‌తో కలిసి నడిచారు.
చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి నటి వివరించారు. చేనేత పైన కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత సరుకులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని పూనమ్ కౌర్ రాహుల్ గాంధీని కోరారు.
రాహుల్ పాదయాత్ర మహబూబ్ నగర్ పట్టణంలో కొనసాగుతోంది. ధర్మాపూర్ లో ఉదయం 6 గంటలకు రాహుల్ యాత్ర మొదలుపెట్టగా.. ఏనుకొండలో ఉదయం 10. 30 గంటలకు విరామం తీసుకోనున్నారు. అక్కడే ఏర్పాటు చేసిన శిబిరంలో లంచ్ చేయనున్నారు.
రాహుల్. రాహుల్ గాంధీ వెంట పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి వికృమార్క, ఎమ్మెల్యే సీతక్క, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, తదితరులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.