Surinder Shinda | పంజాబీ గాయకుడు సురీందర్ షిండా కన్నుమూత
Surinder Shinda లూథియానాలో దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విధాత: ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సురీందర్ షిండా కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో 20 రోజులకు పైగా లూథియానాలో దవాఖానలో సురీందర్‌షిండా చికిత్స పొందుతున్నారు. అయితే, గతంలో షిండా ఆరోగ్యంపై షోషల్‌మీడియాలో తీవ్ర వదంతులు వ్యాపించాయి. షిండా అనారోగ్యంపై వచ్చిన వదంతులపై ఆయన కుమారుడు మణిందర్ షిండా […]

Surinder Shinda
- లూథియానాలో దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
విధాత: ప్రఖ్యాత పంజాబీ గాయకుడు సురీందర్ షిండా కన్నుమూశారు. ఆయన వయస్సు 64 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో 20 రోజులకు పైగా లూథియానాలో దవాఖానలో సురీందర్‌షిండా చికిత్స పొందుతున్నారు.
అయితే, గతంలో షిండా ఆరోగ్యంపై షోషల్‌మీడియాలో తీవ్ర వదంతులు వ్యాపించాయి. షిండా అనారోగ్యంపై వచ్చిన వదంతులపై ఆయన కుమారుడు మణిందర్ షిండా వివరణ ఇచ్చారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దవాఖానలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.
ఆయన వెంటిలేటర్‌పై ఏమీ లేరని, సరైన చికిత్స అందుతున్నదని తెలిపారు. సురీందర్ చికిత్స పొందుతున్న దవాఖాన బయట కూడా తండ్రిపై వచ్చిన వదంతులపై మీడియా పూర్తి వివరాలు వెల్లడించారు. కాగా, 20 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి సురీందర్ షిండగా కన్నుమూశారు.
బాలీవుడ్‌లో సురీందర్ షిండా అనేక హిట్ పాటలు పాడారు. ఆయన పాడిన పాటల్లో ‘జట్ జియోనా మోర్’, ‘పుట్ జట్టన్ దే’, ‘ట్రక్ బిలియా’, ‘బల్బిరో భాభి,’ మరియు ‘కహెర్ సింగ్ డి మౌట్’ వంటివి అనేకం హిట్ అయ్యాయి. సురీందర్ పలు సినిమాలకు పాటలు కూడా రాశారు. సురీందర్ షిండా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటించారు.