Nalgonda: మోడీ పాలనలో.. దారిద్య్రం విలయతాండవం: మంత్రి జగదీష్‌రెడ్డి

27 రాష్ట్రాలలో ఒక్క పూట పస్తులు.. పస్తులు ఉంటున్న35 నుండి 40 శాతం ప్రజలు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దైన్యస్థితి మోడీ పాలనలో గుజరాత్‌లోనూ పెరిగిన దారిద్య్రం విధాత: ప్రధాని నరేంద్ర మోడీ ఏలుబడిలో దేశంలో దారిద్య్రం విలయతాండవం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గుఱ్ఱంపోడు మండల కేంద్రంతో పాటు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పి ఏ పల్లి మండలం అంగడిపేటలో నిర్వహించిన […]

Nalgonda: మోడీ పాలనలో.. దారిద్య్రం విలయతాండవం: మంత్రి జగదీష్‌రెడ్డి
  • 27 రాష్ట్రాలలో ఒక్క పూట పస్తులు..
  • పస్తులు ఉంటున్న35 నుండి 40 శాతం ప్రజలు
  • పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దైన్యస్థితి
  • మోడీ పాలనలో గుజరాత్‌లోనూ పెరిగిన దారిద్య్రం

విధాత: ప్రధాని నరేంద్ర మోడీ ఏలుబడిలో దేశంలో దారిద్య్రం విలయతాండవం చేస్తుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని గుఱ్ఱంపోడు మండల కేంద్రంతో పాటు దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పి ఏ పల్లి మండలం అంగడిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గుఱ్ఱంపోడులో జరిగిన సమ్మేళనానికి స్థానిక శాసనసభ్యులు నోముల భగత్, పిఏ పల్లి మండలం అంగడి పేటలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు, జిల్లా BRS పార్టీ అధ్యక్షుడు నేనావత్ రవీంద్ర నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోడీ ఏలుబడిలో సుదీర్ఘ కాలం ఉన్న గుజరాత్ లో దారిద్య్రం ఆరున్నర శాతం నుండి ఎనిమిదిన్నర శాతానికి పెరిగిందన్నారు.

దేశంలో 27 రాష్ట్రాలలో ఇప్పటికీ ఒక్క పూట పస్తులు ఉంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఒక్కపూట భోజనాలతో పస్తులుంటున్న వారి శాతం 35 నుండి 40 శాతానికి చేరుకుందన్నారు. సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల కంటే మన దేశంలో అందులో మోడీ పాలనలోనే దారిద్య్రం పెరిగిపోయిందన్నారు.

దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతర్దానం అయినట్లే నన్నారు.. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఏకంగా పార్లమెంట్ నుండి తొలగిస్తే ఆ పార్టీకీ సోయి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జీవచ్చంలా మారిందనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కరలేదన్నారు. మోడీ దుర్మార్గాలను నిలువరించేందుకే టిఆర్ఎస్ కాస్తా BRSగా రూపాంతరం చెందిందన్నారు. యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన కోసం నిరీక్షిస్తుందన్నారు.

మహారాష్ట్రతో సహా యావత్ భారతదేశంలోని రైతాంగం, రైతు సంఘాల ప్రతినిధులు బిఆర్ఎస్ లో చేరేందుకు బారులు తీరుతున్నారన్నారు. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో రైతు విప్లవం మొదలైందని, అది మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్‌కు చేరుకొని అక్కడ తిరుగుబాటుకు శంఖారావం పూరిస్తున్నారన్నారు.

రైతు బీమా కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఆనుకొని ఉన్న సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర‌ప్రదేశ్‌లకు చెందిన రైతాంగం గుంట, అరగుంట భూములు కొనుగోలు చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను పొందేందుకు వీలుగా బోర్లు వేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు.