ప్రభాస్‌ది విగ్గే.. వీడియో ప్రూఫ్‌తో దొరికిపోయాడు
విధాత: హీరోలు కూడా సామాన్యమైన మనుషులే కదా వారేమీ పైనుండి ఊడిపడలేదు కాబట్టి హీరో అంటే ఎప్పుడు చక్కని జుట్టుతో అందంతో కనిపించాలని లేదు. కిందటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వారు సినిమాలలో విగ్గు ధరించిన నిజ జీవితంలో బట్టతలతోనే కనిపించేవారు. ఇప్పటికీ రజినీకాంత్ షూటింగ్ లేని సమయంలో చింపిరి జుట్టుతో.. బట్టతలతో.. తెల్లని జుట్టుతో కనిపిస్తాడు. ఇలా కనిపించే వారు చాలామంది ఉన్నారు. వాస్తవానికి తెలుగులో విగ్గు ద్వారా జుట్టును కవర్ చేసే […]

విధాత: హీరోలు కూడా సామాన్యమైన మనుషులే కదా వారేమీ పైనుండి ఊడిపడలేదు కాబట్టి హీరో అంటే ఎప్పుడు చక్కని జుట్టుతో అందంతో కనిపించాలని లేదు. కిందటి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వారు సినిమాలలో విగ్గు ధరించిన నిజ జీవితంలో బట్టతలతోనే కనిపించేవారు. ఇప్పటికీ రజినీకాంత్ షూటింగ్ లేని సమయంలో చింపిరి జుట్టుతో.. బట్టతలతో.. తెల్లని జుట్టుతో కనిపిస్తాడు. ఇలా కనిపించే వారు చాలామంది ఉన్నారు. వాస్తవానికి తెలుగులో విగ్గు ద్వారా జుట్టును కవర్ చేసే హీరోలు చాలా మంది ఉన్నారు.
అయితే.. చాలా మంది హీరోలకు ఆ విగ్గులు సెట్ కావడం లేదు.. నేచురల్ లుక్ ఇవ్వడం లేదు. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు చాలామంది హీరోలు అత్యంత సహజంగా ఉండే విగ్గులు వాడుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే ఆయన ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని కోరుకుంటాడు. జుట్టు పోయినప్పటికీ ఆయన విగ్గు వాడుతుంటాడు.. చాలా అరుదుగా మాత్రమే విగ్గు లేకుండా కనిపిస్తాడు. గతంలో ఆయన నటించిన పలు చిత్రాలు విగ్గు అసహజంగా ఉండడంతోనే.. ట్రోలింగ్ బారిన పడ్డాడు. గత కొంతకాలంగా ఆయన నటించిన చిత్రాలలో కాస్త మంచి విగ్గు.. అంటే ఆయనకు సూట్ అయ్యే విధమైన జుట్టును కలిగి ఉన్నవి వాడుతున్నాడు.
ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రభాస్ జుట్టు సహజమా లేక విగ్గు వాడుతున్నారా అనే సందేహాలు ఎప్పటి నుండో ఉన్నాయి. తాజా బయటికి వచ్చిన వీడియో దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చేసింది. ఆయన విగ్గు వాడుతున్నారని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఒక పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్న ప్రభాస్ జుట్టును హెయిర్ మేకప్ అసిస్టెంట్ సెట్ చేస్తున్నాడు. అప్పుడు ప్రభాస్ ఆ కుర్రాడితో ఇవన్నీ నువ్వు అక్కడే చేయాలి ఇలా బయట చేయవద్దని చెబుతున్నాడు. ఆ మేకప్ అసిస్టెంట్ జుట్టు సరి చేస్తున్న విధానం చూస్తే కచ్చితంగా రీమిక్స్‌గా అనిపిస్తుంది.
మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి సినిమాలు నాటికే ప్రభాస్ జుట్టు కాస్త పలచబడింది. బాహుబలి చిత్రం కోసం ఆయన బాగా జుట్టు పెంచారు. జుట్టు పొడవుగా పెంచితే ఎక్కువగానే ఊడిపోతుంది ఇది సహజం. ఇలా బాహుబలి సిరీస్ కోసం చేసిన ఐదేళ్లలో ఆయన జుట్టు పెద్ద మొత్తంలో లాస్ అయింది. సాహో మూవీ నుండి ప్రభాస్ విగ్గు వాడుతున్నాడు. ఇక బాహుబలి 2 తర్వాత ప్రభాస్ లుక్‌లో చాలా మార్పు వచ్చింది. ఒకప్పటి హ్యాండ్సమ్‌ను ఆయన కోల్పోయారు. కళ్ళ కింద వలయాలు.. అస్పష్టమైన వాయిస్ ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత ట్రై చేసినా ప్రభాస్‌ని అందంగా చూపించలేక పోతున్నారు.
Odiyamma inni RojuLu hair Original Anukunna Kadara Barre @PrabhasRaju pic.twitter.com/jCUXimSlbn
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!— poorna ˢᵗʸˡᶦˢʰ