ప్రశాంత్ కెప్టెన్సీ లాక్కున్న బిగ్ బాస్.. అశ్వినీ మీద పడి అమర్‌దీప్ ఎటాక్

బిగ్ బాస్ సీజన్ 7 తొలి కెప్టెన్‌గా ప్రశాంత్ ఎంపికైన విషయం తెలిసిందే. ఇక హౌజ్‌కి సెకండ్ కెప్టెన్ కోసం బిగ్ బాస్.. పోటుగాళ్లు, ఆటగాళ్లు అని రెండు గ్రూపులుగా విభజించి టాస్క్‌లు పెట్టిన విషయం తెలిసిందే. అయితే జీనియస్ టాస్క్‌లో .. చిన్న చిన్న పశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోయిన అమర్ తన బాధని శివాజీతో, ప్రియాంకతో చెప్పుకొని బాధపడతాడు. రాత్రి అయితే నిద్ర పోకుండా అదే గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటాడు. అయితే ఆ సమయంలో అమర్‌కి ప్రియాంక, సందీప్, యావర్ వంటి వారు ధైర్యం చెబుతారు. ఇక సోషల్ మీడియా బ్యూటీ అశ్వినీని ట్రాప్‌లో దింపేందుకు భోళే తెగ ప్రయత్నిస్తుంటాడు. ఇక సీక్రెట్ రూమ్ నుంచి బయటికి వచ్చిన గౌతమ్‌కు బిగ్ బాస్ స్పెషల్ పవర్ అందిస్తాడు.
బిగ్ బాస్ హౌజ్‌లో రేషన్‌తో పాటు ఎవరు ఏ పని చేయాలి అనేది నువ్వే అసైన్ చేయాలని గౌతమ్‌కి బిగ్ బాస్ చెబుతాడు. అయితే గౌతమ్ అందరికి పనులను అసైన్ చేసిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బిగ్ బాస్.. ప్రశాంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అందరిని ఒక చోటకి పిలిచి అసలు కెప్టెన షిప్ అంటే ఏంటో, ఏం డ్యూటీ చేయాలో చెప్పాలని ప్రతి ఒక్కరిని బిగ్ బాస్ అడుగుతుతాడు. కంటెస్టెంట్స్ అందరితో పాటు ప్రశాంత్ కూడా తన అభిప్రాయం చెబుతాడు. అయితే తను కెప్టెన్ గా ఉన్న సమయంలో తన మాట ఎవరు వినకుండా, తక్కువగా చూస్తున్నారని చెప్పుకొస్తాడు. అయితే మంచి కెప్పెన్సీకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏ ఒక్కటికి.. ప్రశాంత్‌కు లేకపోవడంతో.. వెంటనే కెప్టెన్ బ్యాడ్జ్‌ను తిరిగి ఇచ్చేయాలని చెప్పడంతో ప్రశాంత్ చాలా బాధ పడుతూ.. కెప్టెన్ బ్యాడ్జ్‌ను స్టోర్ రూమ్‌లో పెడతాడు.
కెప్టెన్ షిప్ పోయిందని ప్రశాంత్ చాలా ఏడుస్తుంటే, మరో పక్క ప్రశాంత్ పరిస్థితిని, ఆయన కోసం శివాజీ చేసిన త్యాగాన్ని చూసి ఏడుస్తుంటాడు. శివాజీ కూడా చాలా బాధపడతాడు. ఇక ఆటగాళ్లు.. పోటుగాళ్ల మధ్యలో ఎవరు ఫాస్టెస్టో తెలుసుకునేందుకు ‘కలర్ కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్’ అనే టాస్క్ పెడతాడు. ఈ టాస్క్‌లో బిగ్ బాస్ చెప్పిన కలర్‌కి సంబంధించిన హౌస్‌లోని ఏ వస్తువునైనా తెచ్చి లాన్‌లో మార్క్ చేసిన బాక్సులో వేయాలని చెబుతాడు. ఇందులో ఆటగాళ్లు విజేతలుగా నిలుస్తారు. అయితే గేమ్ అర్ధం చేసుకోకుండా అమర్.. అశ్విని చేతిలో ఉన్న వస్తువుని లాక్కునేందుకు చాలా రచ్చ చేస్తాడు. దీంతో బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తాడు. ఇక మరో టాస్క్‌లో రెండు రాకెట్లను రెండు చేతులతో ఎక్కువ సేపు పట్టుకోవాలని బిగ్ బాస్ చెబుతాడు.ఈ గేమ్ కోసం పోటుగాళ్ల నుంచి అర్జున్ రంగంలోకి దిగగా.. ఆటగాళ్ల నుంచి ప్రిన్స్ యావర్‌ను పంపిస్తారు. అయితే చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన యావర్.. అర్జున్ చేతిలో ఓడిపోతాడు. దీంతో పోటుగాళ్లు.. ఆటగాళ్ల మీద గెలుస్తారు.