ఈనెల 30న యాదగిరిగుట్టకు రాష్ట్రపతి ముర్ము రాక
విధాత: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30న యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 9:10గంటలకు హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం నుంచి హెలికాప్టర్ లో 9:30కి యాదగిరిగుట్ట కు చేరుకోనున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ లో 9:50కి కొండపైకి చేరుకుని 10గంటల నుండి 10:30వరకు స్వామివారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి బొల్లారం చేరుకుంటారు. రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా పెద్దగుట్టపై ఇప్పటికే ఉన్న హెలిఫ్యాడ్ తో పాటు అదనంగా […]

విధాత: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 30న యాదగిరిగుట్టకు రానున్నారు. ఉదయం 9:10గంటలకు హైదరాబాద్లోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం నుంచి హెలికాప్టర్ లో 9:30కి యాదగిరిగుట్ట కు చేరుకోనున్నారు. అక్కడి నుండి కాన్వాయ్ లో 9:50కి కొండపైకి చేరుకుని 10గంటల నుండి 10:30వరకు స్వామివారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తిరిగి బొల్లారం చేరుకుంటారు.
రాష్ట్రపతి పర్యటన కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా పెద్దగుట్టపై ఇప్పటికే ఉన్న హెలిఫ్యాడ్ తో పాటు అదనంగా మరో మూడు హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతి హెలిప్యాడ్ నుండి కాన్వాయ్ లో నేరుగా కొండపైగల ప్రోటోకాల్ ఆఫీస్ పక్క నుంచి ప్రధాన ఆలయం చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలలయం నుండి ప్రధానాలయం క్యూ కాంప్లెక్స్ వరకు ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి భద్రత సిబ్బంది రాకపోకలకు సంబంధించి అందించే తుది ప్రణాళికను అనుసరించి ఆలయ అధికారులు, పోలీసు శాఖ రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు.