Priyanka Gandhi | మే 8వ తేదీకి మారిన ప్రియాంక గాంధీ సభ
Priyanka Gandhi విధాత: ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) తెలంగాణ పర్యటన ఈ నెల 6 నుండి 8వ తేదీకి మారింది. టీపిసిసి ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 6న సరూర్నగర్ స్టేడియంలో తెలంగాణ నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉంది. అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆమె రాలేకపోతున్నందున ఈనెల 8 లేదా 13 తేదీల్లో నిరుద్యోగ నిరసన సభ పెట్టుకోవాలని ఏఐసీసీ సూచించింది. దీంతో […]

Priyanka Gandhi
విధాత: ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi ) తెలంగాణ పర్యటన ఈ నెల 6 నుండి 8వ తేదీకి మారింది. టీపిసిసి ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 6న సరూర్నగర్ స్టేడియంలో తెలంగాణ నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ హాజరు కావాల్సి ఉంది.
అయితే కర్ణాటక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆమె రాలేకపోతున్నందున ఈనెల 8 లేదా 13 తేదీల్లో నిరుద్యోగ నిరసన సభ పెట్టుకోవాలని ఏఐసీసీ సూచించింది. దీంతో నిరుద్యోగ నిరసన సభ ఈ నెల 8వ తేదీకి మార్చడం జరిగిందని, ఈ సభకు ప్రియాంక గాంధీ హాజరవుతారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.