Priyanka Gandhi | బైబై మోదీ.. బైబై కేసీఆర్‌! మీ త్యాగాల వల్ల తెలంగాణ వచ్చింది.. బాగు చేసుకోవడం మీ బాధ్యత

Priyanka Gandhi | తెలంగాణ మీది.. మీ త్యాగాల వల్ల వచ్చింది.. ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత మీదే తెలంగాణ ప్రజలకు ప్రియాంక పిలుపు ఇంకా సాకారం కాని నీళ్లు, నిధులు, నియామకాలు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ జాగీరు కాదు యూత్‌ డిక్లరేషన్‌ అమలు మా బాధ్యత సరూర్‌ నగర్‌ సభలో ప్రియాంక గాంధీ విధాత: బీజేపీ వాళ్లు బైబై కేసీఆర్‌ అంటున్నారని, మరోవైపు బీఆర్‌ఎస్‌ వాళ్లు బైబై […]

  • By: krs    latest    May 08, 2023 4:04 PM IST
Priyanka Gandhi | బైబై మోదీ.. బైబై కేసీఆర్‌! మీ త్యాగాల వల్ల  తెలంగాణ వచ్చింది.. బాగు చేసుకోవడం మీ బాధ్యత

Priyanka Gandhi |

  • తెలంగాణ మీది.. మీ త్యాగాల వల్ల వచ్చింది..
  • ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకునే బాధ్యత మీదే
  • తెలంగాణ ప్రజలకు ప్రియాంక పిలుపు
  • ఇంకా సాకారం కాని నీళ్లు, నిధులు, నియామకాలు
  • ప్రజల ఆకాంక్షలు నెరవేర్చని బీఆర్‌ఎస్‌ సర్కార్‌
  • తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ జాగీరు కాదు
  • యూత్‌ డిక్లరేషన్‌ అమలు మా బాధ్యత
  • సరూర్‌ నగర్‌ సభలో ప్రియాంక గాంధీ

విధాత: బీజేపీ వాళ్లు బైబై కేసీఆర్‌ అంటున్నారని, మరోవైపు బీఆర్‌ఎస్‌ వాళ్లు బైబై మోదీ అంటున్నారని, కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ‘బైబై మోదీ, బైబై కేసీఆర్‌’ అని నినదించాలని కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలు ఇంకా సాకారం కావడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదని మండిపడ్డారు.

సోమవారం సరూర్‌నగర్‌ స్టేడియంలో జరిగిన యువ సంఘర్షణ సభకు ముఖ్య అతిధిగా హాజరైన ప్రియాంక గాంధీ తమ పార్టీ విడుదల చేసిన డిక్లరేషన్‌ను అమలు చేయకపోతే తమ ప్రభుత్వాన్ని దించి వేయాలని అన్నారు. ప్రియాంక గాంధీ తన ప్రసంగాన్ని ‘‘జై బోలో తెలంగాణ’’ అంటూ ప్రారంభించారు.

తెలంగాణ అంటే ఒక భూమి ముక్క కాదన్నారు. మీరు తెలంగాణను తల్లితో సమానంగా చూస్తారని, ఇది అత్యంత పవిత్రమైన అంశమన్నారు. తెలంగాణ అమరవీరులు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారన్నారు. యువత ఆశలను నెరవేర్చడానికి తెలంగాణ ఏర్పాటు అయిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్‌, పూలే, కొమురం భీం ఆశయాలను నెరవేర్చాలన్నారు.

యువత త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నారని ప్రియాంక చెప్పారు. నీరు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించారన్నారు. ‘మట్టి కోసం త్యాగాలు చేయడం నాకు అనుభవం. దేశం కోసం నా కుటుంబంలో కూడా త్యాగాలు చేశారు.. ఆ బాధ ఎలా ఉంటాదో నాకు తెలుసు’ అని ఆమె చెప్పారు.

తెలంగాణ కోసం యువత ప్రాణ త్యాగాలు చూసి సోనియమ్మ తల్లడిల్లారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు చేసినా.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాలు ఇంకా నెరవేరలేదని అన్నారు. మన స్వప్నం నెరవేరడం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్‌ జాగీరు కాదన్నారు.

‘ఇక్కడ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.. బిఆర్ఎస్ ప్రభుత్వం యువకులకు 3 వేల భృతి ఇస్తాం అన్నది. ఇచ్చిందా? 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాల భర్తీ లేదు.. భృతి లేదు. చాలా హామీలు ఇచ్చారు. ఒక్కటి నెరవేరలేదు’ అని ఆమె విమర్శించారు. ‘తక్కువ మంది పాఠశాలలో చేరుతున్నారు. పాఠశాలలో సౌకర్యాలు లేవు’ అని తెలిపారు.

మీ త్యాగాలతోనే తెలంగాణ

‘తెలంగాణ మీది. మీ త్యాగాల వల్ల వచ్చింది.. తెలంగాణను బాగు చేస్కోవడం మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. మీరు చైతన్యంతో ఉండి పని చేయాలి.. లేకపోతే నష్టపోయేది యువతనే’ అని ప్రియాంక చెప్పారు. తనను నయా ఇందిరమ్మ అని పిలవడం మామూలు మాట కాదని, చాలా పెద్ద మాట అని చెప్పారు. ఇందిరమ్మ 40 ఏళ్ల కింద దేశం కోసం త్యాగం చేసిన ఇంకా మీరు గుర్తు పెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు.

తెలంగాణను ఇచ్చిన సోనియమ్మ బిడ్డను తానని చెప్పారు. ఎన్నికల ముందు దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడుతారు.. ఎన్నికల తర్వాత చేతులు దులుపుకుంటారని బీజేపీపై మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బైబై మోదీ, బైబై కేసీఆర్‌ అనాలని పిలుపునిచ్చారు. యూత్ డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని, అమలు చేయకపోతే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని దించేయాలని చెప్పారు.