PSR Anjaneyalu | సీఐడీ చీఫ్‌గా పీఎస్‌ఆర్‌ ఆంజనేయలు

PSR Anjaneyalu అమరావతి: రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయలు సీఐడీ చీఫ్‌గా మంగ‌ళ‌వారం బాధ్యతలు స్వీకరించారు. ప్ర‌స్తుతానికి ఇన్‌ఛార్జి హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా పనిచేస్తున్న సంజయ్‌ హృద్రోగ సమస్యతో బాధపడుతుండ‌డంతో.. డాక్టర్లు ఆయనకి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. సంజయ్‌ కోలుకుంటున్నారని, తిరిగి రాగానే సీఐడీ చీఫ్‌గా యథాస్థానంలోకి వస్తారని సీడీఐ కార్యాలయం స్పష్టం చేసింది. అప్పటివరకూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయలు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని  వెల్లడించింది.

PSR Anjaneyalu | సీఐడీ చీఫ్‌గా పీఎస్‌ఆర్‌ ఆంజనేయలు

PSR Anjaneyalu

అమరావతి: రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పి.ఎస్‌.ఆర్‌.ఆంజనేయలు సీఐడీ చీఫ్‌గా మంగ‌ళ‌వారం బాధ్యతలు స్వీకరించారు. ప్ర‌స్తుతానికి ఇన్‌ఛార్జి హోదాలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటివరకూ సీఐడీ చీఫ్‌గా పనిచేస్తున్న సంజయ్‌ హృద్రోగ సమస్యతో బాధపడుతుండ‌డంతో.. డాక్టర్లు ఆయనకి సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు.

సంజయ్‌ కోలుకుంటున్నారని, తిరిగి రాగానే సీఐడీ చీఫ్‌గా యథాస్థానంలోకి వస్తారని సీడీఐ కార్యాలయం స్పష్టం చేసింది. అప్పటివరకూ పీఎస్‌ఆర్‌ ఆంజనేయలు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించింది.