Murali Mohan Yadav | పుంగ‌నూరు కాంగ్రెస్ అభ్య‌ర్థి ఈయ‌నే..

ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా వున్న మంత్రి పెద్దిరెడ్డి నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరులో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిని ఫైన‌ల్ చేసినట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు స‌మాచారం

Murali Mohan Yadav | పుంగ‌నూరు కాంగ్రెస్ అభ్య‌ర్థి ఈయ‌నే..
  • ఫైన‌ల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం

Murali Mohan Yadav | విధాత‌: ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా వున్న మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరులో కాంగ్రెస్ పార్టీ తమ అభ్య‌ర్థిని ఫైన‌ల్ చేసిని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. సామాజ‌కి స‌మీక‌ర‌ణాలు, భ‌విష్య‌త్తు అవ‌స‌రాలు దృష్టిలో పెట్టుకొని యువ నేత‌, ఆ పార్టీ పీసీసీ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ ముర‌ళీ మోహ‌న్ యాద‌వ్ కే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల‌ని నిర్ణయించిన‌ట్లు తెలుస్తోంది. 15 ఏళ్లుగా విద్యార్థి, యువ‌జ‌న ఉద్య‌మాల్లో వుంటూ బ‌డుగు వ‌ర్గాల ప్ర‌తినిధిగా వుంటున్న ముర‌ళీ మోహ‌న్ ను అభ్య‌ర్థిగా నిలిపితేనే కాంగ్రెస్ ఇక్క‌డ భ‌విష్య‌త్తులో పుంజుకుంటుద‌ని కాంగ్రెస్ అంచ‌నా వేస్తోంది.


ఈ నిర్ణ‌యాన్ని ఇటీవ‌లే తిరుప‌తికి విచ్చేసిన ఏపీసీసీ చీఫ్ వైయ‌స్ ష‌ర్మిలా రెడ్డి సైతం ఫైన‌ల్ చేశార‌ని, యువ‌కుల‌ను, బీసీ వ‌ర్గాల‌ను పార్టీలోకి తీసుకొస్తేనే భ‌విష్య‌త్తులో అధికారంలోకి వ‌స్తామ‌ని ఆమె చెప్పిన‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాలు ధృవీక‌రించాయి. యాద‌వ‌, ఇత‌ర బీసీ వ‌ర్గాల‌ను పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా క‌ష్ట‌ప‌డాల‌ని ష‌ర్మిల .. బీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కు స్ప‌ష్టం చేసినట్లు తెలిసింది.


ఎస్వీయూలో చ‌దువుకొనే రోజుల్లోంచి పెద్దిరెడ్డికి, టిడిపి అధినేత చంద్ర‌బాబుకు ద‌శాబ్దాల కాలంగా వైరం వుంది. ఈ నేప‌థ్యంలోనే పెద్దిరెడ్డిని ఓడించాల‌ని చంద్ర‌బాబు వ్యూహం ప‌న్నారు. బ‌ల‌మైన నేత చ‌ల్లా బాబును బ‌రిలోకి దించి అన్ని శ‌క్తుల‌ను ఒడ్డుతున్నారు. గ‌తంలో ఇక్క‌డ బాబు స‌భ అప్పుడు కూడా పెద్ద ఎత్తున అల్ల‌ర్లు చెల‌రేగాయి. దీంతోపాటు బీసీవైకే అధినేత కూడా రాష్ట్ర స్థాయిలో ఫ్లెక్సీలు, బ్యానర్లు వేస్తూ.. హ‌డావుడి చేసే రామంచంద్ర యాద‌వ్ కూడా ఇక్క‌డ నుంచే పోటీలో వున్నారు. పెద్దిరెడ్డిని ఓడిస్తానంటూ స్ప‌ష్టం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్క‌డ ఎవ‌రై వుంటార‌ని అంద‌రిలోనూ ఆశ‌క్తి నెల‌కొంటోంది.


ముర‌ళీ మోహ‌న్ యాద‌వ్ కు న్యూఢిల్లీ స్థాయిలోనూ లాబీయింగ్ క్యాప‌సిటీ వుండ‌టం వ‌ల్లే పార్టీలో చేరిన అన‌తి కాలంలోనే ఓబీసీ కి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యార‌ని, అలాంటిది నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిగా నిల‌వ‌డం మామూలు విష‌యామ‌ని కొంత‌మంది అంటున్నారు. గ‌త ద‌శాబ్ద కాలంగా యాద‌వ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నేతగా ముర‌ళీ ఎదిగారు. వీటితో పాటు బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటి ఉద్య‌మాల‌కు ద‌న్నుగా నిలుస్తూ వస్తున్నారు.


దీంతో ఎమ్మార్పీస్ తోపాటు బీసీ సంఘాలు ఆయ‌న‌కు ఇప్ప‌టికే మ‌ద్ద‌తు తెలిపాయి. ఎస్వీ యూనివ‌ర్శ‌టీ నుంచి ముర‌ళీ యాద‌వ్ ఎకానామిక్స్ విభాగంలో పీహెచ్ డీ ప‌ట్టా పొందడం, విద్యాధికుడి కావ‌డం, పుంగ‌నూరులో విస్త్రతంగా వున్న ప‌రిచయాలు ఆయ‌న‌కు లాభిస్తాయ‌ని అంటున్నారు. అయితే పెద్దిరెడ్డి కావాల‌నే… రామ‌చంద్ర యాద‌వ్ ఓట్ల‌ను చీల్చాల‌నే ఉద్దేశంతోనే మ‌రో యాదవ్ ను తెర‌పైకి తెస్తున్నార‌ని కొన్ని వ‌ర్గాల భోగ‌ట్టా.