సినిమాలు చూసి.. పూరికి సామాజిక బాధ్యత లేదంటే తప్పు..!
విధాత: పూరి జగన్నాథ్ తీసే చిత్రాలు, ఆయన చిత్రాల్లో ఉండే డైలాగ్స్ సమాజాన్ని యూత్‌ను చెడుదారి పట్టిస్తాయనే వాదన ఉంది. ‘శంకరాభరణం’ చూసి ఎంతమంది సంగీతం వైపు ఆకర్షితులయ్యారు.‘సాగర సంగమం’ చూసి ఎంతమంది నాట్యం వైపు దృష్టి మళ్లించారు.. అనేది చూడకుండా ‘శివ’ చూసి ఎంత మంది చైన్లు పట్టుకున్నారు అన్నది మాత్రమే హైలైట్ చేస్తే ఎలా? వాస్తవానికి సినిమాల ద్వారా బాగు చేయడం చెడగొట్టడం అనేది ఏమీ ఉండదు. కేవలం సినిమా అంటే ఓ టైం […]

విధాత: పూరి జగన్నాథ్ తీసే చిత్రాలు, ఆయన చిత్రాల్లో ఉండే డైలాగ్స్ సమాజాన్ని యూత్‌ను చెడుదారి పట్టిస్తాయనే వాదన ఉంది. ‘శంకరాభరణం’ చూసి ఎంతమంది సంగీతం వైపు ఆకర్షితులయ్యారు.‘సాగర సంగమం’ చూసి ఎంతమంది నాట్యం వైపు దృష్టి మళ్లించారు.. అనేది చూడకుండా ‘శివ’ చూసి ఎంత మంది చైన్లు పట్టుకున్నారు అన్నది మాత్రమే హైలైట్ చేస్తే ఎలా?
వాస్తవానికి సినిమాల ద్వారా బాగు చేయడం చెడగొట్టడం అనేది ఏమీ ఉండదు. కేవలం సినిమా అంటే ఓ టైం పాస్ గానే చూడాలనేది కొందరి వాదన. ఇంకా పూరిని విమర్శించే వాళ్లు ఆయన సామాజిక బాధ్యత లేని చిత్రాలు తీస్తారంటూ తిడతారు. కానీ పూరికి ఎంతో సామాజిక బాధ్యత ఉంది. దానికి ఇటీవల తాళింపు గాళ్లు, మిర్రిరింగ్ వంటి పలు మ్యూజింగ్స్ ద్వారా మెసేజ్ ఇచ్చాడు.
వెనకటికి ఒకాయన మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఓ కార్డు ముక్క రాసి పడేస్తే సరిపోతుంది.. లేదా సెల్ఫోన్లో మెసేజ్ పెడితే సరి. అంతేగాని దానికోసం కోట్లు పెట్టి సినిమా తీయాలా అని ప్రశ్నించాడు. ఇది నిజమే. ఇక పూరీ తన సామాజిక బాధ్యతకు మ్యూజింగ్స్‌ను ఎంచుకున్నాడు.
తాజాగా ఆయన హ్యూమస్ అనే పాయింట్‌పై మాట్లాడారు. హ్యూమస్ అనే దాని గురించి ఎక్కువగా ప్రకృతి ప్రేమికులకు తెలుసు. అది భూమికి, పర్యావరణానికి ఎంతో కీలకము. పూరి మాట్లాడుతూ.. మట్టిలో హ్యూమస్ తయారయ్యేందుకు చాలా కాలం పడుతుంది. ఎంతో ఉపయోగకరమైన దానిని నాశనం చేయొద్దు అని విజ్ఞప్తి చేశాడు.
హ్యూమస్ అనేది నలుపు గోధుమ రంగులో ఉండే సేంద్రీయ పదార్థం. చెట్లనుండి రాలిపోయిన ఆకులు, చనిపోయిన జంతువులు, పురుగులు నేలలో కుళ్ళిపోయి హ్యూమస్ తయారవుతుంది. చెత్త, వృధా ఆహారం తదితర వాటిని ఒకచోట కుళ్లబెట్టినా కూడా హ్యూమస్ వస్తుంది. ఎన్నో మొక్కలు దానిపై ఆధారపడి బతుకుతాయి.
హ్యూమస్ అధికంగా ఉన్న నేల దృఢంగా ఉంటుంది. మొక్కలకు నైట్రోజన్ చాలా అవసరం. అది హ్యూమస్ లో ఎక్కువగా ఉంటుంది. హ్యూమస్ మొక్కలకు బలాన్ని ఇచ్చి వ్యాధుల బారి నుండి కాపాడుతుంది. పెంటకుప్పలో పంట పొలాలకు కావాల్సిన నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్యాల్షియం ,పొటాషియం, మెగ్నీషియం ఉత్పన్నమవుతాయి. ఇవి రైతులకు ఎంతో ఉపయోగకరం.
అయితే మీరు హ్యూమస్ తయారు చేయాలని నేను ఇది చెప్పడం లేదు. దాన్ని పాడు చేయకుండా ఉంటారని చెబుతున్నా. చలికాలంలో మనమంతా చలి మంటలు వేసుకుంటాం.. ఆ మంటల వల్ల భూమిలోని హ్యూమస్ నాశనం అవుతుంది. అందుకే రోజుకో ప్రాంతంలో కాకుండా ఒకేచోట చలిమంటలు వేసుకోండి.
ఫైర్‌ప్రూఫ్ షీట్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. అవి తీసుకొని వాటిపైన మీరు చలి మంటలు కాల్చుకోవచ్చు. మట్టిలో హ్యూమస్ తయారయ్యేందుకు చాలా కాలం పడుతుంది. దాన్ని పది నిమిషాల్లో నాశనం చెయ్యొద్దు అని నా మనవి. హ్యూమస్ అనేది లాటిన్ పదం. దీనికి భూమి అనే అర్థం అని పూరి జగన్నాథ్ వివరించాడు.
Humus is like a skin to earth