Pushpa 2 విధాత: టాలీవుడ్‌కి చెందిన అగ్రగామి సంస్థ అయినటువంటి మైత్రీ మూవీ మేకర్స్, అలాగే ఆ సంస్థతో మంచి అనుబంధం ఉన్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఆఫీస్లపై బుధవారం, గురువారం ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల ప్రభావం ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సుకుమార్ దర్శకుడిగా రూపొందుతున్న ‘పుష్ప 2’(Pushpa 2) సినిమాపై పడినట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ‘పుష్ప ది రూల్’ షూటింగ్ ఆగిపోయిందనేలా వార్తలు వినవస్తున్నాయి. […]
Pushpa 2
విధాత: టాలీవుడ్‌కి చెందిన అగ్రగామి సంస్థ అయినటువంటి మైత్రీ మూవీ మేకర్స్, అలాగే ఆ సంస్థతో మంచి అనుబంధం ఉన్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఆఫీస్లపై బుధవారం, గురువారం ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల ప్రభావం ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో సుకుమార్ దర్శకుడిగా రూపొందుతున్న ‘పుష్ప 2’(Pushpa 2) సినిమాపై పడినట్లుగా ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
‘పుష్ప ది రూల్’ షూటింగ్ ఆగిపోయిందనేలా వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలలోని ఫారెస్ట్ ఏరియాలో పుష్ప 2(Pushpa 2) షూటింగ్ జరుగుతుంది. సడెన్‌గా ఐటీ అధికారులు సోదాలకు దిగడంతో ఉన్నపళంగా షూటింగ్ ఆపేసి సుకుమార్ వచ్చేసినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
రెండు రోజులుగా జరిపిన సోదాలలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల నుంచి అలాగే దర్శకుడు సుకుమార్ నుంచి కొన్ని కీలక పత్రాలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతంత బడ్జెట్లతో సినిమాలు చేయడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని? ఐటీ అధికారులు మైత్రీ నిర్మాతలను ప్రశ్నించినట్లుగా సమాచారం.
అంతేకాదు, మైత్రీ వారికి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయని, వాటితో వారు సినిమాలు నిర్మించడమే కాకుండా.. శంకర్పల్లి, మెయినాబాద్ ఏరియాల్లో భారీ స్థాయిలో అక్రమాస్తులను కొనుగోలు చేసినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారట.
మైత్రీ వారికి సపోర్ట్‌గా సుకుమార్ కూడా ఉండటంతో పాటు, ఆయన కూడా ఈ మధ్య నిర్మాణ రంగంలోకి దిగడంతో.. సుకుమార్ ఆఫీస్లపై కూడా సోదాలు నిర్వహించారని తెలుస్తోంది. అందుకే ‘పుష్ప 2’ షూటింగ్‌ని సడెన్‌గా ఆపేశారని.. తిరిగి మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని విధంగా పరిస్థితులు నెలకొన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఎంత ఉందనేది తెలియాలి.
ఇదిలా ఉంటే.. ‘పుష్ప 2’ షూటింగ్ ఆగిపోలేదని.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ సినిమాకి సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామి ఉండటంతో.. ఆ సినిమా విడుదల సందర్భంగా ‘పుష్ప 2’ షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారనేలా కూడా టాక్ నడుస్తోంది. మరి వీటిలో ఏది నిజమనేది తెలియాల్సి ఉంది.