Pushpa 2 | ఈసారి ‘ఊ’ అనిపించేది సమంత కాదు.. ఎవరో తెలిస్తేనా?

Pushpa 2 | ‘పుష్ప’ మొదటి పార్ట్ గురించి మాట్లాడుకునే ముందు అందులోని ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ, ఊ ఊ అంటావా’ అంటూ వచ్చే లిరిక్స్ పెదాల మీద మనకు తెలీకుండానే కదులుతాయి. ఈపాట లిరిక్స్ అంత ఈజీగా జనాల మెదళ్ళల్లోకి చొచ్చుకుపోయాయి. ఇక ఈ పాటకు సమంత వేసిన స్టెప్స్, అభినయం అన్నీ పాటకు ఇంకా అందాన్ని అద్దాయి. ఏదో ఒళ్ళు చూపించి చిందులేసామన్నట్టు కాకుండా సమంత ఈ పాటకు సరిగ్గా సరిపోయింది. […]

  • By: krs    latest    Jul 15, 2023 2:29 AM IST
Pushpa 2 | ఈసారి ‘ఊ’ అనిపించేది సమంత కాదు.. ఎవరో తెలిస్తేనా?

Pushpa 2 |

‘పుష్ప’ మొదటి పార్ట్ గురించి మాట్లాడుకునే ముందు అందులోని ఐటెం సాంగ్ ‘ఊ అంటావా మావ, ఊ ఊ అంటావా’ అంటూ వచ్చే లిరిక్స్ పెదాల మీద మనకు తెలీకుండానే కదులుతాయి. ఈపాట లిరిక్స్ అంత ఈజీగా జనాల మెదళ్ళల్లోకి చొచ్చుకుపోయాయి. ఇక ఈ పాటకు సమంత వేసిన స్టెప్స్, అభినయం అన్నీ పాటకు ఇంకా అందాన్ని అద్దాయి. ఏదో ఒళ్ళు చూపించి చిందులేసామన్నట్టు కాకుండా సమంత ఈ పాటకు సరిగ్గా సరిపోయింది.

‘పుష్ప’ సినిమా ప్రేక్షకులకు ఎంత బాగా నచ్చిందో.. ఆ సినిమా అందుకున్న భారీ విజయమే ఆ విషయాన్ని చెబుతుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది పుష్ప. అయితే ‘పుష్ప’ పార్ట్ 1 కన్నా గొప్పగా రాబోయే సీక్వెల్ ఉండాలనేది చిత్ర బృందం ఆలోచనట. దీనికి గాను ఐటెం సాంగ్ విషయంలో ఇంకా గొప్ప నటిని తీసుకురావాలని చూస్తున్నారట.

‘పుష్ప’ సీక్వెల్ కోసం బడ్జెట్ విషయంలో అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా లెక్కల మాస్టారు వ్యవహరిస్తున్నా రనేలా టాక్ వినబడుతోంది. ఇక ఈ సినిమా టార్గెట్ 2వేల కోట్లని కొల్లగొట్టాలనేది ఫ్లాన్ అట. ఇందుకు సినిమా కథలో చాలా మార్పులను చేసి తీసుకువస్తున్నారట.

దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో అల్లు అర్జున్‌కి జంటగా రష్మిక మందన్నా నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తుండగా.. సునీల్, అనసూయ నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. ఇక ‘ఊ అంటావా మావ’ పాటను సమంత తన గ్లామర్‌తో మెప్పిస్తే, దేవిశ్రీ సంగీతం మరో లెవెల్. ఈ ఐటెం సాంగ్‌కి సమంతకు భారీ రెమ్యునరేషన్ ముట్టింది. సమంత రెండు కోట్లు‌పైనే తీసుకుందట.

ఇప్పుడు సీక్వెల్లో ఉండే ఐటెం సాంగ్‌కి మరింత ఊపు తెచ్చేలా చిత్రబృందం మరో తార వెనక పడ్డారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమైతే ఈ ఐటెం సాంగ్ రచ్చ లేపుతుందని అంచనా వేశారట. సీక్వెల్ సాంగ్‌కి బాలీవుడ్ నుంచి భామ ఊర్వశి రౌతెలాను పట్టుకొచ్చారని అంటున్నారు. సీక్వెల్‌లో ఐటంసాంగ్ ఇంకా అదిరిపోతుందని, ఇప్పటికే ఈ ఐటమ్‌ని దేవి రెడీ చేసి పెట్టాడనేలా టాక్ నడుస్తుంది.

ఈ పాట షూటింగ్ మూడు రోజులే ఉన్నా దానికి ఊర్వశి ఆరు కోట్లకు పైనే అడిగిందట. గతంలో ఊర్వశి రౌతెలా చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. అఖిల్ ‘ఏజెంట్’లోనూ, పవన్-సాయితేజ్‌ల ‘బ్రో’లోనూ ఆమె ఐటమ్ సాంగ్ చేసింది.

బోయపాటి దర్శకత్వంలో రాబోతున్న రామ్ సినిమా ‘స్కంద’ మూవీలో కూడా ఊర్వశి చిందులేసింది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక పుష్ప సీక్వెల్‌ ఐటమ్‌కి కూడా ఊర్వశి రాతెలా సెట్ అయితే.. కొన్నాళ్ల పాటు టాప్ రేంజ్‌లో ఆమె హవా కొనసాగడం పక్కా.. అంటున్నారు సినీ జనాలు.