Rahul Gandhi | రైల్వే కూలీగా మారి.. నెత్తిపై సూట్‌కేస్‌ మోసిన రాహుల్‌గాంధీ!

Rahul Gandhi ఢిల్లీలో ఆనంద్ విహార్ రైల్వేస్టేష‌న్ సంద‌ర్శ‌న‌ పోర్ట‌ర్లు, కూలీలు ఎదుర్కొంటున్న‌ స‌మ‌స్య‌ల‌పై ఆరా నెత్తిపై సూట్‌కేస్ మోసిన వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్‌ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ మారిన కాంగ్రెస్ నేత వీడియో .విధాత‌: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ కూలీ అవ‌తారం ఎత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వేస్టేష‌న్‌ను గురువారం ఉద‌యం ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రైల్వే పోర్ట‌ర్లు, కూలీలు ఎదుర్కొంటున్న‌స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. कुली भाइयों के बीच जननायक pic.twitter.com/nor4tSyoR8 […]

Rahul Gandhi | రైల్వే కూలీగా మారి.. నెత్తిపై సూట్‌కేస్‌ మోసిన రాహుల్‌గాంధీ!

Rahul Gandhi

  • ఢిల్లీలో ఆనంద్ విహార్ రైల్వేస్టేష‌న్ సంద‌ర్శ‌న‌
  • పోర్ట‌ర్లు, కూలీలు ఎదుర్కొంటున్న‌ స‌మ‌స్య‌ల‌పై ఆరా
  • నెత్తిపై సూట్‌కేస్ మోసిన వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్‌
  • సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ మారిన కాంగ్రెస్ నేత వీడియో

.విధాత‌: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ కూలీ అవ‌తారం ఎత్తారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వేస్టేష‌న్‌ను గురువారం ఉద‌యం ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రైల్వే పోర్ట‌ర్లు, కూలీలు ఎదుర్కొంటున్న‌స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు.

కూలీలంతా వ‌య‌నాడ్ ఎంపీ రాహుల్ చుట్టూ మూగారు. కూలీలు త‌మ యూనిఫామ్ అయిన‌ రెడ్ షర్ట్‌ను ధ‌రింప‌జేశారు. ఈ సంద‌ర్భంగా త‌న త‌ల‌పై రాహుల్ సూట్‌కేస్ పెట్టుకొని మోశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు కూలీలు రాహుల్‌ను ప్ర‌శంసిస్తూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి.

” ఈ రోజు ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ప్రజా నేత‌ రాహుల్ గాంధీ పోర్టర్ల‌ను కలిశారు. ఇటీవల రైల్వే స్టేషన్‌లోని పోర్టర్లు రాహుల్‌ను కలవాలని విజ్ఞ‌ప్తి చేశారు. ఇందుకు సంబంధించిన‌ వీడియో వైరల్‌గా మారింది. దానిపై రాహుల్ స్పందించారు. ఈ రోజు రాహుల్ అక్కడికి చేరుకుని పోర్ట‌ర్ల స‌మ‌స్య‌లు విన్నారు. భారత్ జోడో ప్రయాణం కొనసాగుతున్న‌ది” అని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో (ట్విట్ట‌ర్‌) పోస్ట్ చేసింది.