24న తెలంగాణలోకి రాహుల్ పాదయాత్ర..! ఏ రోజు ఎక్కడంటే
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర శుక్రవారం కేరళ నుంచి కర్ణాటకలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో యాత్రను ముగించుకున్న అనంతరం ఏపీ మీదుగా రాహుల్ యాత్ర అక్టోబర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణలోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… రాహుల్ పాదయాత్రపై కీలక నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా […]

విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర శుక్రవారం కేరళ నుంచి కర్ణాటకలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో యాత్రను ముగించుకున్న అనంతరం ఏపీ మీదుగా రాహుల్ యాత్ర అక్టోబర్ 24న రాహుల్ యాత్ర తెలంగాణలోకి అడుగు పెట్టనుంది. ఈ సందర్భంగా శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… రాహుల్ పాదయాత్రపై కీలక నేతలతో సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్రను దిగ్విజయం చేస్తామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందుకోసం సబ్ కమిటీలను ఏర్పాటు చేసుకుని ఆ కమిటీలకు పార్టీ సీనియర్లను ఇంచార్జీలుగా నియమిస్తామని తెలిపారు. ఇక తెలంగాణలో రాహుల్ పాదయాత్రకు అనుమతి కోసం శనివారం డీజీపీని కలవనున్నట్లు రేవంత్ తెలిపారు.
ఈ పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కృష్ణ గ్రామం దగ్గర ప్రారంభమై. రాష్ట్రంలో మొత్తం 13 రోజుల పాటు 359 కిలోమీటర్లు నడవనున్నారు. ఆ తర్వాత రెండో రోజు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మూడో రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో.. 4వ రోజు జడ్చర్లలో పాదయాత్ర చేస్తారు. 5వ రోజు షాద్ నగర్, ఆరో రోజు శంషాబాద్ ప్రాంతంలో జరిగే పాదయాత్రలో పాల్గొంటారు.
ఆ తర్వాత 7వ రోజు శేరిలింగంపల్లి, 8వ రోజు పటాన్ చెరు నియోజకవర్గంలో రాహుల్ జోడో యాత్ర సాగనుంది. 9వ రోజు సంగారెడ్డి, పదవ రోజు సంగారెడ్డి జిల్లా జోగిపేట.. 11 వ రోజు నాడు శంకరం పేటలో పర్యటించనున్నారు. చివరి రెండు రోజులు జుక్కల్ లోనే పాదయాత్ర చేయనున్నారు. భారత్ జోడో యాత్రను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.