తెలంగాణలో రాహుల్ పాదయాత్ర.. ఘనంగా స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి
Rahul Gandhi| విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి ఆదివారం ఉదయం ప్రవేశించింది. రాయిచూర్ నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం వద్ద రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. […]

Rahul Gandhi| విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మీదుగా తెలంగాణలోకి ఆదివారం ఉదయం ప్రవేశించింది. రాయిచూర్ నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఘన స్వాగతం పలికారు.
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం వద్ద రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. టైరోడ్డు వరకు కిలోమీటర్ మేర రాహుల్ పాదయాత్ర చేపట్టనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో రాహుల్ ప్రసంగిస్తారు. అనంతరం రాహుల్ పాదయాత్ర విరామం ప్రకటించనున్నారు.
అక్కడ్నుంచి నేరుగా ముంబైలోకి హెలికాప్టర్లో వెళ్లి, ఢిల్లీకి బయల్దేరుతారు. 24, 25, 26వ తేదీల్లో దీపావళి సందర్భంగా రాహుల్ ఢిల్లీలో ఉండనున్నారు. తిరిగి ఈ నెల 27న మక్తల్ సమీపంలోని 33 కేవీ సబ్ స్టేషన్ నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది.
ఇక రాహుల్ పాదయాత్ర నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసిరావాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ విడియోను విడుదల చేశారు.

రాహుల్ గాంధీని తెలంగాణలోకి ఆహ్వానిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంపొందించే పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. సామాన్యులకు చేరువయ్యేందుకు రాహుల్ భారత్ జోడో యాత్రతో దేశమంతా కదిలిందని సాగే పాట ప్రజల్లో ఉత్సాహం పెంపొందిస్తోంది.